బిగ్ బాస్ షోలో ప్రస్తుతం ఫ్యామిలీ ఎమోషన్స్ నడుస్తున్నాయి. నిన్నటి ఎపిసోడ్‌లో అభిజిత్, అఖిల్, హారిక, అవినాస్ అమ్మ ఎంట్రీ ఇచ్చారు. అమ్మలు పంచిన ప్రేమకు అందరూ ఫిదా అయ్యారు. అమ్మ ప్రేమ ఇంత కమ్మగా ఉంటుందా? అంత ఉత్సాహాన్ని, ఎనర్జీని నింపుతుందా? అని తెలియజేశారు. అఖిల్ మదర్ దుర్గ ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీ.. అభిజిత్ తల్లి లక్ష్మీ ఇచ్చిన జోష్.. హారిక తల్లి ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఇలా అన్నీ వైరల్ అయ్యాయి. అమ్మలు పంచిన ప్రేమతో ఇళ్లంతా ప్రశాంతంగా మారింది. అందరూ కలిసి పోయారు.
అయితే నేటి ఎపిసోడ్‌లో మాత్రం ఎమోషన్స్ పీక్స్‌లోకి వెళ్లేలా కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్ మాత్రమే తన అమ్మను చూశాకా చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. మిగతా వారంత మరీ అంత ఎమోషనల్ అవ్వలేదు. కానీ నేటి ఎపిసోడ్‌లో మాత్రం మోనాల్ తన కన్నీటి దారకు కట్టలు తెగిపోయేలా ఉన్నాయి. బిగ్ బాస్ సెట్ మొత్తం మునిగిపోయేలా ఉంది. ఒక వైపు మోనాల్ మరో వైపు లాస్య ఇలా ఇద్దరూ దాడి చేసేలానే ఉన్నారు.
#Sohel, #Lasya, #Ariyana families came for visit…What about #Monal?#BiggBossTelugu4 today at 9:30 PM on @StarMaa pic.twitter.com/amotru084G
— starmaa (@StarMaa) November 19, 2020
కానీ లాస్య మాత్రం తన బిడ్డ జున్ను, భర్తను చూశాక సంతోషంలో తేలిపోయినట్టుంది. సోహెల్ తన తండ్రిని చూసి మురిసిపోయాడు. అరియానా తన లవర్‌ను చూసి సంతోషపడింది. ఎటొచ్చి మోనాల్‌కు మాత్రం బిగ్ బాస్ ఏదో షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. మోనాల్ వాళ్ల అమ్మ గొంతును మాత్రమే వినిపించాడు. మేం నిన్ను చూడటానికి రావాలని అనుకున్నాం.. కానీ కుదర లేదు అని చెప్పింది. ఆ మాటలు విన్నాక మోనాల్ ఏడుపు ఆపుకోలేకపోయింది. బాత్రూంలోకి వెళ్లి దబదబా కొట్టేసుకుంది. అయితే మోనాల్ సోదరి వచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ తన కోసం ఇలా స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతోన్నాడని సమాచారం.