బిగ్ బాస్ షోలో వ్యవహారం ఒక్కో రోజు వేడిగా ఉంటుంది. మళ్లీ మరునాడు అదంతా చల్లారి పోతుంది. మాటల యుద్దాలకు తెరదీసిన కంటెస్టెంట్లే మరుసటి రోజు ప్రేమగా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఎందుకంటే మనకు చూపించేది ఆ ఐదు నిమిషాల గొడవే. కానీ ఇంట్లో ఆ సభ్యులు 24 గంటల పాటు ఉంటారు. అప్పుడే గొడవలు పడతారు.. మళ్లీ అప్పుడే సర్దుకుంటారు. అలా చేస్తేనే ముందుకు వెళ్తుంటారు. కానీ గొడవలను మనసులో పెట్టుకుని, పదే పదే టార్గెట్ చేయడం ప్రారంభిస్తేనే చిక్కులు వస్తాయి.
అఖిల్ ప్రస్తుతం చేస్తున్నది అదే అనిపిస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి అఖిల్‌కు అభిజిత్ అంటే నచ్చదు. ప్రతీసారి ఏదోలా టార్గెట్ చేయాలని చూస్తాడు. ఎవరిది తప్పు అన్నది పక్కన పెట్టి అభిజిత్ చొరవదీసుకుని వచ్చి మాట్లాడినా మాట్లాడడు. సారీ చెప్పినా రియాక్ట్ అవ్వడు. ఇదే పద్దతిని సోహెల్‌కు కూడా నూరి పోస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్నటి టాస్క్‌లో సోహెల్ చాలా కష్టపడ్డాడు. కానీ చివరికి ఓడిపోయాడు. స్విమ్మింగ్ పూల్‌లో బరువు ఎత్తే టాస్క్‌లో బాగానే ఆడాడు.
కానీ చివరకు గెలవలేదు. బాగా ఆడావ్.. బాగా ట్రై చేశావ్ అంటూ అభిజిత్ దగ్గరకు వచ్చి ఓదార్చాడు.. ప్రశంసించాడు. హారిక కూడా దగ్గరకు వచ్చి మాట్లాడింది. అయితే ఇదే విషయాన్ని సోహెల్ అఖిల్ వద్ద చెప్పాడు. అభిజిత్ వచ్చి అలా అన్నాడు ఇలా అన్నాడు అని అఖిల్‌తో సోహెల్ ముచ్చటించాడు. మన దగ్గర ఉన్నది ఇదే ఇలానే ఐస్ అయిపోతాం.. వాళ్లు మంచిగా ఒక్క మాట మాట్లాడితే కూల్ అయిపోతాం.. మళ్లీ రేపొద్దున ఇంకోటి అంటారు అని సోహెల్‌కు బ్రైన్ వాష్ చేశాడు. మొత్తానికి సోహెల్ మాత్రం అఖిల్ చెప్పినట్టు ఆడుతున్నాడు.