బిగ్‌బాస్ షోలో ఇప్పటికీ అంతు పట్టని ఓ కథ ఏదైనా ఉందంటే అది మోనాల్‌కు సంబంధించిందే అయి ఉంటుంది. ఆమె అఖిల్, అభిజిత్‌తో ఆడే ఆటలు బయటకు అర్థమవుతున్నాయి. కానీ ఆ ఇద్దరికే అర్థం కావడం లేదు. మొదట్లో మంచిగా స్నేహితుల్లా ఉన్న అభి, అఖిల్ చివరకు మోనాల్ వల్ల బద్దశత్రువులయ్యారు. అయితే మోనాల్ గుట్టువిప్పుతూ సుజాత సంచలన కామెంట్స్ చేసింది.
మోనాల్ చాలా క్లారిటీతోనే ఉంది. ఆమె ఆ ఇద్దరి ఫీలింగ్స్‌తో ఆడుకుంటోంది. మామూలుగా అభి, అఖిల్ వచ్చిన కొత్తలో ఫ్రెండ్లీగా ఉండేవారు. కానీ ఈమె వల్లే అలా తయారయ్యారు. పగలంతా అఖిల్‌తో పడుకుంటుంది. రాత్రి అఖిల్ కాస్త త్వరగా పడుకుంటాడు. అందుకే అభిజిత్‌తో సోఫాలో కూర్చుని ముచ్చట్లు పెడుతోంది. ఆమె రెండు పడవలపై ప్రయాణం అంటూ సుజాత మోనాల్ కథలను బయట పెట్టింది.
అయితే ఆమెది ట్రయాంగిలా? అని ప్రశ్నిస్తే కాదని చెప్పింది. అది ట్రయాంగిల్ కాదని ఆమె ఇద్దరితో ఉంటోందని, ఆమె గేమ్ ఆడుతోందని సుజాత పూస గుచ్చినట్టు వివరించింది. తన దగ్గర ఒకలా, నాగార్జున అడిగిత ఒకలా చెప్పడంతో మోనాల్‌పై కోపంగా ఉన్నాడు అభిజిత్. ఇక ఎప్పటికీ మాట్లాడుకోవద్దంటూ నిన్న నిర్ణయించుకున్నాడు. మరి మోనాల్‌కు నిజంగా దూరంగా ఉంటాడా? లేదా? అన్నది చూడాలి.