Mothevari Love Story Trailer: ఆద్యంతం ఆకట్టుకునేలా ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్‌‌

భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్‌ రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేందుకు ఆగస్ట్ 8న జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ అందరినీ మెప్పించింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం నాడు తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

Mothevari Love Story | Official Trailer | Telugu ZEE5 Original | Anil G, Varshini | Premieres 8 Aug

‘ఇగో ఇదే మా ఊరు.. ఆరె పల్లి.. ఊరుఊరుకో మోతెవరి ఉన్నట్టు.. మా ఊరికి ఓ మోతెవరి ఉన్నడు..’ అంటూ ప్రియదర్శి వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. హీరో అనిల్ పరిచయం, హీరోయిన్ వర్షిణితో లవ్ ట్రాక్, ఊర్లోని పెద్దలు, భూ సమస్య, ప్రేమ వంటి అంశాలతో ట్రైలర్‌ను చక్కగా కట్ చేశారు. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఈ సిరీస్‌ను ఆద్యంతం వినోద భరితంగా మలిచారని అర్థం అవుతోంది. ‘పర్శిగాడంటేనే పర్‌ఫెక్ట్’, ‘ఉశికే ఉడికించుడే’ అనే డైలాగ్స్ నవ్వులు పూయించేలా ఉన్నాయి. ‘అమ్మాయిలు భలేగా ఉంటరే.. మోసాన్ని కూడా ముద్దుగ చెప్తరే’ అంటూ సాగే డైలాగ్ ఎమోషనల్ డెప్త్‌ను కూడా చూపిస్తోంది. ఆగస్ట్ 8న ఈ సిరీస్ అందరినీ అలరించేందుకు రాబోతోంది.

ఈ సిరీస్‌కు చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించగా.. శ్రీకాంత్ అరుపుల కెమెరామెన్‌గా పని చేశారు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌‌‌లో అనిల్ గీలా, వర్షిణి, మురళీధర్, సదానందం, సుజాత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

Sr Journalist Bharadwaj Reaction On Prakash Raj Comments On Pawan Kalyan | Hari Hara Veeramallu | TR