సిగ్గు, మానం ఏమీ లేవా.. బాబా భాస్కర్‌పై యాంకర్ రవి ఫైర్

దసరా పండుగ వచ్చేస్తోంది. బుల్లితెరపై పండుగ వాతావరణం ఆ సందడి రెట్టింపు చేసేందుకు అందరూ రెడీ అవుతున్నారు. స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు ఇలా అందరూ ఎవరికి వారు రెడీ అయ్యారు. అక్కా ఎవరే అతగాడు అంటూ జబర్దస్త్ ఆర్టిస్ట్‌లందరూ వస్తోండగా.. స్టార్ మాలో సీరియల్ ఆర్టిస్ట్‌లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు రాబోతోన్నారు. ఇక జీ తెలుగులో బొమ్మ అదిరింది టీం రచ్చ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే అక్కా ఎవరే అతగాడు అంటూ జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు, శేఖర్ మాస్టర్, నవదీప్, హైపర్ ఆది, సంగీత వంటి వారు హల్చల్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక స్టార్ మా కూడా జాతరో జాతర అంటూ దుమ్ములేపేందుకు ఇందుకోసం ఏకంగా వంటలక్కను దింపారు. మామూలుగా కార్తీక దీపం ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్ ఎప్పుడూ కూడా బయట ఈవెంట్లకు రాదు.

కానీ ఈ సారి దసరా ఈవెంట్ కోసం అమ్మోరు పాత్రను పోషించింది. ఈ ఈవెంట్‌లోనే బాబా భాస్కర్ కూడా రచ్చ చేయబోతోన్నాడు. మామూలుగా స్టార్ మా ఈవెంట్లలో బాబా మాస్టర్ ఈ మధ్య బాగానే మెరుస్తున్నాడు. అయితే ఈసారి బాబా మాస్టర్, యానీ మాస్టర్‌తో ట్రాక్ నడిపించేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. యానీ మాస్టర్‌తో పులిహోర కలుపుతోన్న బాబా మాస్టర్‌ను.. సిగ్గు మానం లాంటివి లేవా అంటూ యాంకర్ రవి వారించాడు. నాకు అలాంటివేమీ లేవని బాబా మాస్టర్ నిర్మోహమాటంగా చెప్పేశాడు.