బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన అనసూయ సినిమాలలో కూడా నటించే అవకాశాలు అందుకుంది. సినిమాలలో వైవిద్యమైన పాత్రలలో నటిస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకునే అనసూయ బుల్లితెర మీద మాత్రం తన గ్లామర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ లో అనసూయ యాంకరింగ్ తో పాటు ఆమె గ్లామర్ వల్ల కూడా బాగా పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో అనసూయ తన అందంతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. టీవీ షోస్ కోసం గ్లామరస్ దుస్తులను ధరించి ఫోటో షూట్ లకు ఫోజులిచ్చే అనసూయ వాటిని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే కొన్ని సందర్భాలలో అనసూయ ధరించే దుస్తులు వల్ల విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది. అంతేకాకుండా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇలాంటి గ్లామర్ షో అవసరమా అంటూ నెటిజన్స్ ఆమెను తెగ ట్రోల్ చేస్తుంటారు. అయితే అనసూయ మాత్రం వారందరికీ స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ ఉంటుంది. ఇలా తరచూ వివాదాల్లో ఉండే అనసూయ ఇటీవల మరొక వివాదంలో నిలిచింది. సోషల్ మీడియాలో తనని ‘ఆంటీ’ అని ఏజ్ షేమింగ్ చేసేవారి స్క్రీన్ షాట్ తీసుకుంటున్నానని , తనని ఆంటీ అని కామెంట్ చేసే వారి పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతున్నానని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో నెటిజన్స్ అనసూయని నాన్ స్టాప్ ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆంటీ అంటేనే జైల్లో పెట్టిస్తా అని అంటే ట్విట్టర్ లో ఉన్న సగం మంది జైల్లోనే ఉంటారు అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా..‘ఇక్కడ చాలా జైళ్లు, చాలా సెక్షన్లు ఉన్నాయి..’ అంటూ అనసూయ రిప్లై ఇచ్చింది. ఇలా అనసూయ చేసిన చాలా ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్స్ అనసూయ ని ఆంటీ అంటూ ట్రోల్ చేస్తూ ఆమెని రెచ్చగొడుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్లో ‘ఆంటీ ‘ అనే ట్యాగ్ లైన్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ విషయంలో అనసూయ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.