బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…ఇంట్లో పెద్దవాడిని నేనున్నాను కదా ఒక మాట నాకు చెప్పి వెళ్లాలి కదా అంటూ నందు అనడంతో నీకు చెబితే నువ్వు పంపించావు కదా అందుకే నీకు చెప్పకుండా వెళ్ళిపోయారు అయినా వాళ్ళు ఏం చిన్న పిల్లలు కాదు వారికి నచ్చినట్టు బతుకుతారు అని పరంధామయ్య చెబుతాడు. వెంటనే లాస్య కల్పించుకొని తండ్రి మాట వినాలి అని చెప్పాల్సింది పోయి మీరే ఇలా మాట్లాడితే ఎలా అనడంతో వెంటనే పరంధామయ్య ఈ తండ్రి మాట వినకుండా నందు నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా అనడంతో ఇద్దరు షాక్ అవుతారు
ఆ సమయంలో నందు మాట్లాడుతూ అయినా వీళ్ళు తులసి ఇంటికి వెళ్లడం నాకు ఇష్టం లేదు తులసి కారణంగానే శృతికిలా అయింది మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిన ముందు నాకు చెప్పండి మన ఇంటికి కేవలం తులసి ఒక బంధువు మాత్రమే అంతేకానీ ఇక్కడ సమస్యలను తన దగ్గర చెప్పకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మీటింగ్ ఉండడంతో తులసి ప్రిపేర్ అవుతుండగా అంత ఇంగ్లీషులోనే ఉంటుంది. అర్థం కాకపోవడంతో దివ్య సహాయం తీసుకుని ఆ మీటింగ్ కు సంబంధించిన అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకుంటుంది. మరోవైపు పరంధామయ్యకు షుగర్ లెవెల్స్ పడిపోవడంతో అనసూయమ్మ కంగారుపడుతూ తనకు చెక్కర కల్పించాలని కిందికి వెళ్ళగా అన్ని లాక్ చేసి ఉంటుంది. దీంతో లాస్య వద్దకు వెళ్లి తనకు కీస్ కావాలని తన మామయ్యకు షుగర్ లెవెల్స్ పడిపోయాయని చెప్పిన నిద్రపోతుంది.
అదే సమయంలో అంకిత అక్కడుండడంతో తన పరిస్థితి మొత్తం చెప్పడంతో అంకిత వెళ్లి శృతి రూమ్లో గ్లూకోస్ తీసుకువచ్చి పరంధామయ్యకు సాగిస్తుంది.మరుసటి రోజు ఉదయం అంకిత వంటింట్లో పనిచేస్తూ ఉండగా లాస్య వెళ్లి కాఫీ అడగడంతో కాస్త నడుము ముంచి నీ కాఫీ నువ్వే పెట్టుకో అంటూ తనతో గొడవ పడుతుంది.రాత్రి తాతయ్య గారికి షుగర్ కావాలంటే కీస్ లేవన్నావట ఈ ఇంట్లో తాతయ్య అమ్మమ్మకు ఏమీ కానంతవరకే నీ పెత్తనం వాళ్లకు ఏమైనా అయ్యింది అంటే నువ్వు బయటకు వెళ్లాల్సి ఉంటుంది అంటూ తనకు తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తుంది.
మరోవైపు సామ్రాట్ బెనర్జీ మీటింగ్ కోసం ఉండగా తులసి ఆలస్యం చేస్తుంది. ఎందుకు ఇంకా తులసి రాలేదని సామ్రాట్ ఆలోచిస్తూ ఉంటాడు.బెనర్జీ మాత్రం మీరు ఈ కంపెనీకి సీఈఓ మీరు జనరల్ మేనేజర్ కోసం వెయిట్ చేయడం ఏంటి తొందరగా సైన్ చేయండి నాకు సీఎం అప్పాయింట్మెంట్ ఉంది అని చెప్పడంతో సామ్రాట్ మాత్రం తులసి కోసం వెయిట్ చేస్తాడు. అయితే తులసి బెనర్జీ ప్రొడక్ట్స్ గురించి ఆయన విషయాల గురించి పూర్తి తెలుసుకోవడానికి వెళ్లి ఉంటుంది.తులసి కోసం వెయిట్ చేసిన సామ్రాట్ తను ఎంతసేపటికి రాకపోయేసరికి సంతకం పెట్టబోతుంటాడు అదే సమయంలో తులసి అక్కడికి వెళ్లి ఆపుతుంది.
మీరు స్కూల్ కట్టడానికి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు అని తులసి చెప్పడంతో ఈ మధ్యకాలంలో ఎవరు పర్మిషన్లు తీసుకుంటున్నారు అన్ని ఫేక్ కదా అనడంతో ఇక్కడ అవన్నీ కుదరవు పర్మిషన్ తీసుకున్నారా లేదా అనడంతో బెనర్జీ కోప్పడుతూ వంటింట్లో వంట చేసుకుంటూ ఉండాల్సిన వాళ్ళని ఇలా బిజినెస్ లోకి తీసుకొస్తే ఇలాగే ఉంటుంది సామ్రాట్ గారు మీరు తన మాటలు ఏమీ పట్టించుకోకండి ముందు సంతకం చేయండి అనడంతో సామ్రాట్ కూడా తులసికి సపోర్ట్ చేస్తూ తాను సైన్ చేయనని చెబుతాడు దీంతో బెనర్జీ షాక్ అవుతాడు.