HomeTV SHOWSజబర్దస్త్‌లోకి సుమ గ్రాండ్ ఎంట్రీ.. మొత్తానికి అలా వాడేశారు!!

జబర్దస్త్‌లోకి సుమ గ్రాండ్ ఎంట్రీ.. మొత్తానికి అలా వాడేశారు!!

జబర్దస్త్ షో బుల్లితెరపై ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షో నుంచి ఎక్స్ ట్రా జబర్దస్త్ షో వరకు దాని సత్తా పెరిగింది. అలా రెండు షోలుగా విడగొట్టినా దాని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. జబర్దస్త్‌ను అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్‌ను రష్మీ బాగా లాక్కొచ్చారు. ఇక టీం లీడర్లు తమ ప్రతిభతో ఇన్నాళ్లు నవ్విస్తూ వచ్చారు. రాను రాను స్కిట్స్‌లోనూ కొత్త కొత్తగా ఆలోచిస్తూ చేస్తోన్నారు.

Anchor Suma Special Entry Into Extra Jabardasth
Anchor Suma Special entry Into Extra Jabardasth

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో స్టార్ మహిళను ఎక్స్ ట్రా జబర్దస్త్‌ను కలిపేశారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కెవ్వు కార్తీక్ చేసిన ఓ స్కిట్‌లో సుమ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్ లేడీ గెటప్ వేయడం, భర్తగా కెవ్వు కార్తీక్ నటించారు. స్టార్ మహిళకు తీసుకెళ్లమని భార్య పోరు పెట్టడం, తన్నుకుంటూ మరీ లాక్కెళ్లడంతో స్టార్ మహిళ సెట్‌లోకి వెళ్లిపోతారు. ఇదంతా ఎక్స్ ట్రా జబర్దస్త్ షో నుంచే జరుగుతూ వచ్చింది.

అలా స్టార్ మహిళ సెట్ నుంచే స్కిట్‌ను చేసే శాడు. ఇమ్మాన్యుయేల్, కెవ్వు కార్తీక్ వచ్చి పంచ్‌లు వేయగా.. ఆ వెంటనే రష్మీ కూడా ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే సుమ స్థానానికే ఎసరు పెట్టింది. ఎంత సేపు అలా నిల్చుంటారు.. సోఫా వేసుకుని కూర్చొవచ్చు కదా.. అని సుమకు రష్మీ సూచించింది. అయితే నేను గ్యాప్ ఇస్తే నువ్ వచ్చి కూర్చుందామని చూస్తున్నావా? అని రష్మీకి సుమ రివర్స్ కౌంటర్ వేసింది. ఇలా సుమ క్రేజ్‌ను ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం వాడుకుంది.

 

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News