యాంకర్ రవి పెళ్లి మ్యాటర్ అనేది ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్. అసలు రవికి పెళ్లి అయిందా? లేదా? అన్నది ఓ భేతాళ ప్రశ్న. యాంకర్ రవి లాస్య, శ్రీముఖిలతో వ్యవహారం చాలా దూరం వెళ్లడంతో, తెరపై వీరి కెమిస్ట్రీ ఓ రేంజ్‌లోకి వెళ్లే సరికి రచ్చ రచ్చ అయింది. నీకుపెళ్లి అయిందా? అని వెళ్లిన ప్రతీ చోట యాంకర్ రవిని అడిగేవారు. ఇక ఆన్‌లైన్‌లోకి వచ్చినా ఇదే ప్రశ్నను సంధించేవారు. నాకు పెళ్లైతే ఏంటి కాకపోతే మీకేంటి అని ఘాటుగా స్పందించేవాడు.
చివరకు యాంకర్ రవి తన భార్య, కూతురిని అందరికీ పరిచయం చేశాడు. ఫ్యామిలీ పిక్ పోస్ట్ చేసి అందరి నోర్మూయించాడు. ఇక ఎన్నో షోల్లో తన ప్రేమ కథను వివరించాడు. బీటెక్‌లో మొదలైన తమ ప్రేమను పెళ్లి వరకు వెళ్లిందని, అలా మా ప్రాణానికి ప్రతిరూపం కూతురు రూపంలో వియాగా పుట్టిందని చెబుతూ ఉంటాడు. ఇక వియా అంటే రవికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వియాతో రవి చేసిన ఓ పర్ఫామెన్స్ అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేసింది.
ఈ లాక్ డౌన్‌లో వియాతో ఎంతో సరదాగా గడిపిన రవి.. ఆమె కోసం ఓ స్పెషల్ ప్రోగ్రాం కూడా చేశాడు. దాగుడు మూతలు ఆడుతూ శ్రీముఖి, సుమ, ఇలా అందరితో కలిసి ఓ వీడియో చేశాడు. నేడు వియా బర్త్ డే. ఈ సందర్భంగా అందరూ వెకేషన్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. అయితే కారులో నానమ్మ తాతయ్య మధ్యలో కూర్చున్న వియా అల్లరి పనులు చేసింది. కారులో పడుకుంటున్న తాతయ్యను ఒక్కసారిగా అరిచి భయపెట్టింది. దీంతో దెబ్బకు నిద్రలోంచి లేవడంతో వియా ఫక్కున నవ్వేసింది. వియా అల్లరిని చూసి తన తాత కూడా నవ్వేశాడు.