పెళ్లి పీటలెక్కబోతున్న రష్మీ ?

యాంకర్ రష్మీ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అంతకుముందే పలు సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నాలు చేశారు. ఈమెకు వెండితెరపై పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇక బుల్లితెరపై సుడిగాలి సుదీర్,రష్మికకు మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు వీరిద్దరూ ఖండిస్తూ వచ్చారు. ఇలా డీ జోడి కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఎన్నోసార్లు వీరిద్దరికీ వేదికపై పెళ్లి తంతు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

ఈ విధంగా జబర్దస్త్ వేదికపై ఎన్నోసార్లు పెళ్లి చేసుకున్న రష్మీ నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా రష్మీ మరోసారి తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నానని, ఈ సందర్భంగా ఈమె సిగ్గుపడుతూ మెలికలు తిరిగి తన పెళ్లి విషయాన్ని చెబుతూ కాస్తా ఎమోషనల్ అయ్యారు.

ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రతివారం సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారు ఈ సమయంలోనే ఈ వారం అక్క బావేవెక్కడ అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే రష్మీ తన పెళ్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నిజంగానే రష్మీ పెళ్లి కుదిరిందా ఇ ఎపిసోడ్ హైలెట్ చేయడం కోసమే మరోసారి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.