భర్త పక్కన ఉండగానే ముద్దులతో రెచ్చి పోయిన అనసూయ..ఫోటో వైరల్!

జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయకు సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమయ్యారు. ఇలా ఈ కార్యక్రమం నుంచి దూరమైన అనసూయ వరుస సినిమాలతో ఎంతో బిజీ అవుతున్నారు. ఇకపోతే వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు.

సోషల్ మీడియా వేదికగా అనసూయ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా అనసూయ తన భర్తతో కలిసి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి సెల్ఫీకి ఫోజులిచ్చారు. అయితే ముద్దు పెడుతూ ఉన్నట్టు ఈమె సెల్ఫీకి ఫోజులిచ్చారు.

ఈ ఫోటోని ఎలాంటి క్యాప్షన్ లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు చూసిన అభిమానులు యధావిధిగా అనసూయ పై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇలా భర్త పక్కన ఉండగానే ఇలా ముద్దులు పెట్టడం ఏంటి అనసూయ అంటూ పెద్ద ఎత్తున ఈమెపై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అనసూయ తన భర్తతో కలిసి దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.