సుధీర్ పర్ఫార్మెన్స్ కి పది రూపాయలు చేతిలో పెట్టిన అనసూయా.. మరీ అంత దారుణమా..?

జబర్థస్త్ ద్వార ఫేమస్ అయిన సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్థస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షో లలో మాత్రమే కాకుండా ఈటీవి లో ప్రసారమైన అనేక కార్యక్రమంలో సుధీర్ సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే కొంతకాలం క్రితం సుధీర్ జబర్థస్త్ నుండి బయటికీ వచ్చి మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ వంటి షో లో యాంకర్ గా సందడి చేస్తున్నాడు. అయితే సుధీర్ ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ సందడిగా ఉంటుంది. ఈ సింగింగ్ షో లో కూడా సుధీర్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.

ఈ షో లో సుధీర్ అనసూయతో కలసి యాంకరింగ్ చేస్తున్నాడు. అయితే అనసూయా కూడా జబర్థస్త్ నుండి బయటికీ వచ్చి ఈ షో లో యాంకర్ గా సందడి చేస్తోంది. ఈ షో లో అనసూయ తో పాటు అక్కడున్న జడ్జ్ లు కూడా సుధీర్ మీద సెటైర్లు పంచులు వేస్తుంటారు. ఇక అక్కడ పాటలు పాడే చిన్న పిల్లలు కూడా సుధీర్ మీద పంచులు వేస్తుంటారు. ఇదిలా ఉండగా ఈ షో లో సుధీర్ కి, హరిప్రియ కు ట్రాక్ క్రియేట్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు. కానీ హరి ప్రియ మాత్రం సుధీర్ ని అన్నయ్య అని పిలిచేసింది.

అయితే ఇటీవల విడుదలైన ఈ షో ప్రోమో లో అన్నయ్య అంటూ పిలిచే హరిప్రియని ఇంప్రెస్స్ చేయాలని సుధీర్ కి టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో హేమచంద్రతో పాట పాడించి ప్రపోజ్ చేయాలని సుధీర్‌కు టాస్క్ ఇచ్చింది. ఇక హరిప్రియ కూడా తనని ఇంప్రెస్స్ చేస్తే అన్నయ్య అని పిలవను అంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో హేమచంద్ర సహాయంతో సుధీర్ ప్రపోజ్ చేసేందుకు రెడీగా ఉంటే.. కానీ అతని మాత్రం ఏవేవో పిచ్చి పాటలు పాడాడు. ఇలా హరిప్రియ ముందు సుధీర్ ని బకరా చేశారు. ఇక చివర్లో సుధీర్ పర్ఫార్మెన్స్ కి అనసూయ అతని చేతిలో 10 రూపాయలు పెట్టీ దారి ఖర్చులకి ఉంచుకోమంటుంది. ఇలా అనసూయ సుధీర్ పట్ల మరీ దారుణంగా వ్యవహరించింది.