అందంగా ఉండే అనసూయ మనసు మరీ ఇంత కఠినమా

ఒకప్పుడు బుల్లితెరమైన ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతూ నంబర్ వన్ స్థానంలో ఉండేది. కానీ ప్రస్తుతం జబర్దస్త్ పరిస్థితి తారుమారయ్యింది. ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో మంచి అవకాశాలు పొందుతున్నారు. అలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన చాలామంది ఈ జబర్దస్త్ నుండి ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. ఇదివరకే సుడిగాలి సుదీర్, హైపర్ ఆది , గెటప్ శ్రీను జబర్థస్త్ కి దూరమయ్యారు. అయితే శ్రీను ఇటీవల మళ్లీ జబర్థస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ జబర్థస్త్ లో లేకపోవటంతో జబర్థస్త్ కల తప్పింది. ఈ షో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపటం లేదు.

ఈ తరుణంలో జబర్ధస్త్ కి మరొక పెద్ద దెబ్బ తగిలింది. జబర్థస్త్ మొదలైనప్పటి నుండి జబర్థస్త్ లో యాంకర్ గా సందడి చేస్తున్న అనసూయ కూడా ఇటీవల జబర్థస్త్ కి గుడ్ బై చెప్పింది. అనసూయ తన యాంకరింగ్ తో పాటు తన అందాలతో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో కమెడియన్స్ మీద పంచ్ లు వేస్తూ సందడి చేసింది. ఇలా 10 సంవత్సరాల పాటు జబర్థస్త్ తో అనుబంధము పెంచుకున్న అనసూయ ఇక ఇప్పటినుండి జబర్థస్త్ లో కనిపించదు. సినిమా అవకాశాలు ఎక్కువ రావటంతో అనసూయ జబర్థస్త్ కి దూరమయ్యింది.

అయితే గత అనసూయ జబర్థస్త్ లో లాస్ట్ ఎపిసోడ్ కి యాంకరింగ్ చేసింది. ఆ ఎపిసోడ్ లో మల్లెమాల వారు అనసూయ కి గ్రాండ్ గా సెండాఫ్ ఇచ్చారు. ఆ సమయంలో అక్కడున్న వారందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. జడ్జ్ ఇంద్రజ గారు కూడా ఏకంగా కన్నీళ్ళు పెట్టుకున్నారు. అయితే తను దూరమవుతుందని అందరూ అనసూయ కోసం బాధ పడుతుంటే అనసూయ మాత్రం కొంచం కూడా బాధ పడలేదు. ఇంద్రజ ఏడుస్తున్న కూడా అనసూయ మొహంలో బాధ కనిపించలేదు. ఆఖరికి చంటి కూడా ఎమోషనల్ అవుతూ..మా కోసం నెలలో మూడు రోజులు నీ సమయం కేటాయించలేవా అంటూ అడిగితే దానికి కూడా అనసూయ చిరునవ్వుతో కుదరదని చెప్పింది. అయితే ఈ విషయంలో అనసూయ ప్రవర్తనను చూసిన ప్రేక్షకులు ఇంత అందంగా ఉండే అనసూయ మనస్సు ఇంత కఠినమైనదా అంటూ ఆశ్చర్యపోతున్నారు.