పొట్టి నిక్కరు ధరించి టెక్సాస్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న అనసూయ.. ఫోటో వైరల్?

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇలా గ్లామరస్ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండడం వల్ల బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయడానికి తీరిక లేకుండా పోయింది.ఈ క్రమంలోనే బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే నటిగా పలు సినిమాలతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సినిమా షూటింగ్ ల నిమిత్తం ఇతర దేశాలలో పెద్ద ఎత్తున పర్యటిస్తూ సినిమా షూటింగ్లలో పాల్గొంటారు. ఈ క్రమంలోనే షూటింగ్ ఇతర దేశాలకు వెళ్లిన లేదా కుటుంబంతో కలిసి విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లిన ఈమె అందమైన లోకేషన్లలో క్యూట్ ఫోటోలను దిగుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె అమెరికా పర్యటనలో ఉన్నట్టు తెలుస్తుంది.

అమెరికా పర్యటనలో ఉన్నటువంటి అనసూయ టెక్సాస్ వీధుల్లో పొట్టి దుస్తులను ధరించి చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే టాప్ టు బాటమ్ కనిపించేలా హాట్ సెల్ఫీకి ఫోజులిచ్చారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒకసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ విధమైనటువంటి పొట్టి దుస్తులను ధరిస్తూ అనసూయ ఫోటోషూట్లు చేయడం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల పెద్ద ఎత్తున నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అయితే ఈమె వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు.