సెల్ ఫోన్ సీక్రెట్ బయటపెట్టిన అనసూయ.. అంతా అందులోనే ఉంటుందంటూ కామెంట్స్!

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ గురించి తెలియని వారంటూ ఉండరు. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షో లలో యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఇలా యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయకి సినిమాలలో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అనసూయ బుల్లితెరకు దూరమై సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉంటుంది. ఇలా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాకి అనసూయకి మధ్య ఒక మంచి అనుబంధం ఉంది . సోషల్ మీడియాలో అనసూయ ఏ పోస్ట్ షేర్ చేసిన కూడా నిమిషాలలో వైరల్ గా మారుతుంది.

ఇదిలా ఉండగా అనసూయ ఇటీవల “మాయాపేటిక” అనే సినిమా ఈవెంట్ లో సందడి చేసింది. గతంలో అనసూయ నటించిన “థాంక్యూ బ్రదర్ ” సినిమాకి నిర్మాతలకు వ్యవహరించిన వారు ఇటీవల “మాయాపేటిక” అనే సినిమాకి కూడా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ లుక్కును అనసూయ చేతుల మీద లాంచ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ కి యాంకర్ రవి హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ ఈవెంట్ లో అనసూయ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అనసూయ మాట్లాడుతూ.. నన్ను చాలామంది సెల్ఫిష్ అని అంటారు. కానీ సినిమాలో నేను లేకపోయినా కూడా ఆ సినిమా బాగుంది అని అంటున్నాను అంటే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఈ ఈవెంట్ లో అందరిని సెల్ ఫోన్ ల సీక్రెట్ ల గురించి అడిగాడు. కానీ అనసూయని మాత్రం అడగలేదు. దీంతో..అందరినీ అడిగావు నన్ను ఎందుకు అడగలేదు? అని రవిని ప్రశ్నించింది. దీంతో రవి మాట్లాడుతూ.. అడుగుదామని అనుకున్నా … కానీ ఎందుకొచ్చిన గొడవ అంటూ సైలెంట్ అయ్యాను అని రవి చెప్పుకొచ్చాడు. వెంటనే అనసూయ మాట్లాడుతూ.. నాదంతా కూడా నా ఫోన్ లోనే ఉంటుంది అన్నట్లుగా తన కాంట్రవర్సీల మీద తానే కౌంటర్లు వేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.