ఆ విషయంలో కమెడియన్ అలీపై మండిపడిన అల్లు అరవింద్.. ఏం జరిగిందంటే?

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలీ ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రతి వారం ఈ కార్యక్రమానికి ఒక సెలబ్రిటీని ఆహ్వానించి వారిని ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ వారం ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ అలీ అడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు తాజాగా అల్లుకు రామలింగయ్య 100వ జయంతి వేడుకలను అలాగే అల్లు స్టూడియో నిర్మాణం గురించి కూడా ఈయన ముచ్చటించారు.ఇకపోతే తాను అల్లు రామలింగయ్య నటించిన 22 సినిమాలలో తన కొడుకు పాత్రలలో నటించానని తెలిపారు.

ఈ విధంగా 22 సినిమాలలో కొడుకుగా నటించారని చెప్పగానే అల్లు అరవింద్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై అలీ మాట్లాడుతూ అల్లు రామలింగయ్య గారికి మీరు పెద్ద కొడుకు నేను రెండో కొడుకు అని చెప్పారు.అలాగే ఆస్తిలో కూడా వాటా ఉంది అంటూ అలీ మాట్లాడగా అవి తేల్చడానికి ఇక్కడికి వచ్చా అంటూ అరవింద్ కౌంటర్ వేశారు. ఇంతవరకు సరదాగా సాగిన ఈ ప్రోమో ఒక్కసారిగా ఉత్కంఠత లేపింది. ఈ క్రమంలోనే మెగా, అల్లు కుటుంబాల మధ్య డిస్టబెన్స్ ఉందనీ అలీ ప్రశ్నించడంతో అల్లు అరవింద్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఇలాంటి కాంట్రవర్సీ ప్రశ్నలు వద్దని ముందే చెప్పాము కదా అయినా ఇదేంటి అంటూ ఒక్కసారిగా అలీపై ఫైర్ అయ్యారు. అయితే ఈ విషయంపై అల్లు అరవింద్ ఎలాంటి సమాధానం చెప్పారనే విషయం తెలియాలంటే అక్టోబర్ 10వ తేదీ వరకు వేచి ఉండాలి.