షూటింగ్స్ లేకపోయినా మల్లెమాలవారు డబ్బు ఇచ్చేవారు… అదిరే అభి కామెంట్స్ వైరల్!

జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి ఆ కార్యక్రమా నిర్వాహకులపై కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈయన మల్లెమాలవారు సరైన వసతి భోజనాలు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని ఇకపోతే శ్యాం ప్రసాద్ రెడ్డి గారు చావు బతుకుల మధ్య ఉన్న కానీ ఎలాంటి సహాయం చేయరంటూ మల్లెమాల వారిపై ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆర్పీచేసిన వ్యాఖ్యలను కొంతమంది తిప్పి కొట్టారు మరి కొంతమంది ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు.

ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన వారిలో అదిరే అభి కూడా ఉన్నారు.ఈయన కూడా జబర్దస్త్ ద్వారా మంచి పాపులారీటీ సంపాదించుకొని బయటకు వచ్చినప్పటికీ మల్లెమాల వారి గురించి ఏ విధమైనటువంటి విమర్శలు చేయలేదు. ఈ క్రమంలోనే
ఆర్పీ చేసిన వ్యాఖ్యలను అభి తిప్పి కొట్టారు.ఇకపోతే శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన మీకు ఎప్పుడైనా సహాయం చేశారా అనే ప్రశ్న ఎదురవగా ఈ ప్రశ్నకు అభి సమాధానం చెబుతూ శ్యాం ప్రసాద్ రెడ్డి గారు జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఒక మూడు సంవత్సరాలు పాటు వీళ్ళు బయటకు వెళ్లారనే నమ్మకం కలిగితేనే ముందుగా అడ్వాన్స్ ఇస్తారని అభి చెప్పారు.

ఇకపోతే తనకు అప్పు చేయాలంటే ఎంతో భయం అని అప్పు చేస్తే కనుక తనకు నిద్ర కూడా పట్టదని అందుకే తాను ఎవరితో ముందుగా పేమెంట్ తీసుకోవడం లేదా అప్పు చేయడం లాంటివి చేయనని అభి వెల్లడించారు. ఇకపోతే కరోనా సమయంలో జబర్దస్త్ కార్యక్రమ నిర్వాహకులు ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత డబ్బును స్వయంగా ఇంటికి పంపించేవారు.అయితే కరోనా సమయంలో నెక్స్ట్ షెడ్యూల్ లేకపోయినా ముందుగానే అడ్వాన్స్ కూడా ఇచ్చారని ఈ సందర్భంగా అభి మల్లెమాల వారి గురించి చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.