సీరియల్ నటిని లైన్ లో పెట్టిన ఆది.. కలసి స్టెప్పులేస్తూ రెచ్చిపోయాడుగా?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి తమ టాలెంట్ ని నిరూపించుకునే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఎంతో మంది జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా హైపర్ ఆది నటన మీద ఉన్న ఆసక్తి వల్ల ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఈ క్రమంలో జబర్దస్త్ లో అవకాశం రావడంతో తన టాలెంట్ నిరూపించుకొని అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు.

ఆది జబర్దస్త్ లో టీమ్ లీడర్ అయిన తర్వాత జబర్దస్త్ రేటింగ్స్ మరింత పెరిగాయని చెప్పటంలో సందేహం లేదు. ఆది వేసే పంచులు, సెటైర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం ఆది స్కిట్ కోసం మాత్రమే జబర్దస్త్ చూసే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా యూట్యూబ్ లో కూడా లక్షల సంఖ్యలో ఆదికి ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఆది సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఆది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలలో నటిస్తున్నాడు. ఇలా టీవి షోస్, సినిమాలతో ఆది చాలా బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈటీవీ 27 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా భలే మంచి రోజులు అని ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో ఆది సందడి మామూలుగా లేదు. సుధీర్,అనసూయ కూడా ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ నటి నటులు కూడ పాల్గొన్నారు. ఈ క్రమంలో శతమానంభవతి అని సీరియల్ టీం కూడా సందడి చేసింది. ఈ సీరియల్ లో నటిస్తున్న ఒక యువతిని ఆది లైన్ లో పెట్టాడు. ఆమె కలసి స్టెప్పులు కూడా వేశారు. ఆమె కూడా ఆదిని చూసి సిగ్గు పడుతూ , ఆదికి సహకరిస్తూ వెళ్లి ఆది కాలి మీద కూర్చొనింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని లవ్ సింబల్ కూడా వేశారు. తర్వాత మరోక సందర్భంలో ఇమ్యాన్యుల్ లేచి అన్నా రెచ్చిపోమంటావా అని అనగా శతమానం భవతి తప్ప ఇక అందరి మీద రెచ్చిపో అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి సీరియల్ నటి తో ఆదికి లవ్ ట్రాక్ వర్కౌట్ చేయాలని చాలా ట్రై చేశారు.