రాజమౌళి ని కూడా వదలని ఆది… సీరియస్ అవుతున్న జక్కన్న ఫ్యాన్స్…?

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన అది చాలాకాలంగా జబర్దస్త్ కి దూరంగా ఉంటూ శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే అది జబర్దస్త్ కి తిరిగి రావాలని అతని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆది జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు . జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చిన ఆదికి ఘన స్వాగతం పలికారు. వచ్చి రాగానే అది నేను జబర్దస్త్లోకి వచ్చినట్టు లేదు పాలిటిక్స్ లోకి వచ్చినట్టు ఉంది అంటూ సెటైర్ వేశాడు.

ఇదిలా ఉండగా వచ్చేవారం ప్రసారం కానున్న జబర్దస్త్ ఎపిసోడ్ లో ఆది తన మార్క్ చూపించుకోవడానికి ఇటీవల టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను ఉపయోగించుకున్నాడు. ఆది గతంలో కూడా ఇలా ఎన్నో సినిమాల కాన్సెప్ట్ తో స్కిట్లు చేసాడు. ఇక ఇప్పుడు బాహుబలి, పుష్ప, కే జి ఎఫ్, విక్రమ్, ఆర్ ఆర్ ఆర్ వంటి హిట్ సినిమాల కాన్సెప్ట్ తో ఫుల్ కామెడీ చేశాడు. ఆది చేసిన కామెడీ కి ప్రేక్షకులు నవ్వినా కూడా ఆ సినిమాల హీరో కి ఉన్న అభిమానులు మాత్రం ఆది మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు.

ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో మల్లి పాత్రలో నటించిన అమ్మాయి కొమ్మ ఉయ్యాల కోన జంపాల అనే పాట తర్వాతే సినిమా స్టోరీ మొదలవుతుంది. ఇప్పుడు ఈ స్కిట్ లో మల్లి పాత్రతో పేరడీ చేస్తూ.. నువ్వు ఆ కొమ్మా ఉయ్యాల పాట పాడుకుంటే ఇంత జరిగేదే కాదు కదా అంటూ కౌంటర్ వేశాడు. దీంతో రాజమౌళి వంటి గొప్ప దర్శకుడు తెరకెక్కించిన సినిమా మీద పేరడీ చేస్తూ ఆ సినిమా మీద కౌంటర్లు వేయటంతో రాజమౌళి అభిమానులు ఆది మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు. రాజమౌళి మీదే కౌంటర్లు వేసే అంత గొప్ప వాడివా నువ్వు అంటూ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.