బుల్లితెరపై ప్రసారమవుతున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఐదు సీజన్లను పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ప్రసారమవుతుంది. ఈ సీజన్ కూడా ఇప్పటికే 10 వారాలను పూర్తి చేసుకొని హౌస్ నుంచి 11 మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా చివరికి గెలిచిన కంటెస్టెంట్ కి 50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుందని మొదటి సీజన్ నుంచి ప్రకటిస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో గెలిచిన కంటెస్టెంట్ 50 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకుంటే అతనికి 50 లక్షలు రాదని ఇందులో చాలా కోతలు ఉంటాయని తెలుస్తోంది.
ఈ విధంగా ఎవరైతే బిగ్ బాస్ విజేత అవుతారో వారికి ట్రోఫీతో పాటు 50 లక్షలు అందిస్తారు. కానీ ఇందులో 14 లక్షల వరకు టాక్స్ లు పోను కేవలం 36 లక్షలు మాత్రమే విజేతకు ఉంటుంది. ఇక ఈ సీజన్లో రేటింగ్ పూర్తిగా తగ్గిపోవడంతో బిగ్ బాస్ సరికొత్త స్కెచ్ వేసి కంటెంట్ ప్రైజ్ మనీలో కోత విధించినట్టు తెలుస్తుంది.ఈవారం నిర్వహించిన టాస్క్ లో భాగంగా ఇమ్యూనిటీ పవర్ అంటూ లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు ఎవరైతే చెక్ పై ఎక్కువ అమౌంట్ రాస్తారో వారు అధిక ఇమ్యూనిటీ పవర్ పొందినట్లు అని తెలిపారు.
ఇలా చెక్కుపై ఎవరైతే ఎక్కువ అమౌంట్ రాస్తారో వారు ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ అందుకొని ఆ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అవుతారని బిగ్ బాస్ సూచించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి కంటెస్టెంట్లలో రాజశేఖర్ ఎక్కువగా 500000 రాయడంతో ఈయన ఎంతో ఇమ్యూనిటీ పవర్ సొంతం చేసుకొని ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. ఇలా వచ్చే ప్రైజ్ మనీలో టాక్స్ లు పోను ఈ ఇమ్యూనిటీ పవర్ కింద కూడా అమౌంట్ కట్ అవ్వడంతో కంటెస్టెంట్ కి పెద్దగా ప్రైజ్ మనీ దక్కదని తెలుస్తోంది.