దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ విజయవాడ సిటీలోకి అడుగుపెట్టకుండా విజయవాడ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం వర్మని విజయవాడ నగరంలోకి అనుమతించమని పోలీసులు తేల్చి చెప్పారు. నోవాటెల్‌లో ప్రెస్‌మీట్ పెడుతానంటే ఆ హోటల్ వారు అనుమతించలేదట. దాంతో ఆయన నగరంలోని పైపుల రోడ్డులో రోడ్డు మీదే ప్రెస్‌మీట్ పెడుతానని ప్రకటించారు.ఐతే పోలీసులు మాత్రం ఆయన్ని అదుపులోకి తీసుకొని తిరిగి హైదరాబాద్ పంపించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందంటూ ఆరోపణలు గుప్పించారు. తాజాగా వర్మకు అండగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు.
విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..!
చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2019
విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం చంద్రబాబు గారు అంటూ ధ్వజమెత్తాడు. ఇంతకీ రాంగోపాల్ వర్మ చేసిన తప్పేంటి? అని ప్రశ్నించాడు. వాస్తవానికి వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ జగన్ హస్తం ఉందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ సమయంలో వర్మ చాలా సమస్యలు ఫేస్ చేసాడు. కానీ అప్పటికి ఎలక్షన్స్ జరగలేదు.
ఈ నేపత్యంలో జగన్ సినిమా గానీ, వర్మను గానీ ఉద్దేశించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. తాజాగా ఎన్నికలు పూర్తవ్వడం..వైకాపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో వర్మ తరుపున జగన్ వకాల్తా పుచ్చుకోవడం అంతటా చర్చకొస్తుంది. ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్‌లో అప్‌డేట్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదా అని ఆయన విరుచుకుపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వర్మ విమర్శలు చేశారు.