‘వై.యస్ జగన్’ పై సినిమా, ఆ సీన్స్ హైలెట్ గా?

బయోపిక్ తీయటం అనేది ఇప్పుడు ఇది సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలో ట్రెండ్. ఇప్పటికీ సినీ నాయకులూ నుంచి రాజకీయ నాయకుల వరుకు బయోపిక్స్ మొదలెట్టారు..రిలీజ్ చేసారు..ఇంకా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల జీవిత ఘట్టాలపై సినిమాలు తీసేసారు. ప్రస్తుతం యువ నేత వైస్ జగన్ బయోపిక్ తియనున్నట్టు ఇటు ఇండస్ట్రీలోనూ అటు రాజకీయ నేతల్లోనూ వార్తలు వినిపించాయి. అయితే ఎవరూ జగన్ పై సినిమా చెయ్యటానికి సాహసించలేదు.

కానీ పోసాని ఆ భాధ్యతను భుజంపై పేసుకున్నారు. కాకపోతే అది జగన్ జీవిత కథగా కాకుండా…జగన్ ఆశయాలు, ఆయనకు ఎందుకు పాద యాత్ర చేస్తున్నారు. తండ్రి మరణానంతరం జగన్ ..రాజకీయంగా నిర్వహించిన పాత్ర…ఆయన్ను ప్రత్యర్దులు ఇరుకున పెట్టడానికి చేసిన కుట్రలు, జైలుకు పంపటం వంటివి ఉండబోతున్నాయట. వీటిని పోసాని తనదైన స్టైల్ లో అదిరిపోయే డైలాగులు రాసి మరీ తెరకెక్కించబోతున్నారు.

ప్రముఖ నటుడు, రచయిత, డైరెక్టర్ పోసాని కృష్ణమురళి రెండు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసి సరిగ్గా ఎన్నికలకు 15 రోజులు ముందు ఈ సినిమా రిలీజ్ చెయ్యాలని నిర్ణయిచారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.

అలాగే ఈ సినిమాలో డైలాగ్స్ కూడా కొన్ని చెప్పేసారు పోసాని. ‘ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో, పట్టుదలో… చరిత్రనే నిర్ణయించుకోనీ’ ‘బాబు దుమ్ముదులిపిన జగన్’ అని డైలాగ్ లు ఈ సినిమాలో పెట్టబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా జగన్ కు ఎన్నికల సమయంలో ఉపయోగపడుతుంది అని పోసాని భావిస్తున్నారు.

ఇక ఈమధ్య కాలంలో సినిమా సెలబ్రెటీలు జగన్ ను కలవడం మేము మీకు సపోర్ట్ అని చెప్పడం చూస్తూనే ఉన్నాం. కమెడియన్ ఆలి, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి రాజ్ , పోసాని కృష్ణమురళి జగన్ ను కలిసి తమ సపోర్ట్ ఉంటుంది అని మాట ఇచ్చారు. వారంతా ఈ సినిమాలో ఉండబోతున్నారు. అయితే ఇవి జగన్ డబ్బులుతో స్వయంగా తీయించుకుంటున్నట్లు కొందరు సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టారు. అయితే జగన్ ఇలాంటివి చేయరని, ఆయన మీద అభిమానంతో పోసాని స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.