తనకంటే పదేళ్ల చిన్న వాడు అయిన హీరో ఆమె అంటే పడి చస్తాడు. తను లేనిదే నిదురపోడు. తిండి నిదుర అసలు ఉండనే ఉండదు. ఆ సంగతిని ఆయనే స్వయంగా చెప్పాడు. నేను వ్యక్తిగతంగా వృత్తిగతంగా సంతోషంగా సుఖ నిద్రతో ఉండాలంటే తనతో చెలిమి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరా హీరో? అంటే.. కపూర్ వారసుడు అర్జున్ కపూర్ గురించే.
అతడి ఏజ్ 36.. కానీ 44 ఏళ్ల మలైకా అరోరాఖాన్ తో అతడి స్నేహం ప్రేమాయణం నిరంతరం హాట్ టాపిక్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అసలు మలైకాతో పెళ్లి గురించి ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదని ఖరాకండిగా చెప్పేయడం చూస్తుంటే అతడు కేవలం స్నేహం వరకే తమ రిలేషన్ షిప్ ని కొనసాగిస్తున్నాడని అంతా భావిస్తున్నారు. ఇక మలైకా వైపు నుంచి వెర్షన్ ఎలా ఉంది? అంటే అసలు తనకు ఇప్పట్లో పెళ్లాడే ఆలోచనే లేదని తమ మధ్య బంధం వల్ల ఎంతో సుఖసంతోషాలతో ఉన్నామని చెబుతోంది.
మలైకా నిరంతరం యోగా ఫోటోలు వీడియోలు సహా సోషల్ మీడియాల్లో భారీగా ఫాలోయింగ్ ని పెంచుకుంది. ఓవైపు వాణిజ్య ప్రకటనలు .. మరోవైపు ఫిట్ నెస్ వీడియోలు తన రెవెన్యూని పెంచుతున్నాయి. త్వరలోనే తన కుమారుడు 18ఏళ్ల అర్హన్ ఖాన్ ని హీరోని చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది.
ఇందుకేనా కుర్ర హీరో పరేషాన్?