కెవ్వు కేక.! టాలీవుడ్ మళ్ళీ ఆ ఐటమ్ కేక.?

‘గబ్బర్ సింగ్’ సినిమా గుర్తుందా.? ఎలా మర్చిపోగలం..? పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమా అది. బాలీవుడ్ మూవీ ‘దబాంగ్’ రీమేక్ ఈ ‘గబ్బర్ సింగ్’.!

శృతి హాసన్ హీరోయిన్ కాగా, ఈ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక’ అంటూ ఓ ఐటమ్ సాంగ్ అప్పట్లో పెను సంచలనం. బాలీవుడ్ నటి మలైకా అరోరా ఈ స్పెషల్ సాంగ్‌లో డాన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా.!

తెలుగులో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు మలైకా అరోరా. తాజా ఖబర్ ఏంటంటే, మలైకా అరోరాని మళ్ళీ తెలుగు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఓ సీనియర్ హీరో సినిమా కోసం మలైకా అరోరాని టాలీవుడ్‌కి మళ్ళీ తీసుకొస్తున్నారట.

ఎవరా సీనియర్ హీరో.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. నిజానికి, మలైకా సినిమాల్లో నటించడం బాగా తగ్గించేసింది ఈ మధ్యకాలంలో. అలాంటి మలైకాని ఒప్పించడమంటే మామూలు విషయం కాదు. అదీ స్పెషల్ సాంగ్ కోసమంటే ఇంకా కష్టం.

ఒప్పించే పనులు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయనీ, చాలా గట్టిగానే మలైకా అరోరా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందనీ అంటున్నారు. అంత మొత్తం ఆమెకెందుకు చెల్లించడం.? అంటూ టాలీవుడ్‌లో గుసగుసలూ వినిపిస్తున్నాయి.

సినిమా అంటేనే మ్యాజిక్.! ‘కెవ్వు కేక’ భామ స్పెషల్ సాంగ్.. అన్న ప్రస్తావనే పాజిటివ్ సౌండింగ్.. అనే వాదనా వుంది మరి.!