పుష్ప 2  లో అర్జున్ కపూర్?

తెలుగు తో పాటు మలయాళం అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ స్టార్ హీరోస్ తో సమానంగా అల్లు అర్జున్ కి క్రేజ్ ఉంది. అయితే ‘పుష్ప’ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. సుకుమార్ ఇప్పటికే ‘పుష్ప’ సీక్వెల్ కి సంబందించిన పని పూర్తి చేసేసాడు, షూటింగ్ త్వరలో మొదలు కాబోతుంది.

మొదటి భాగంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ లో మెప్పించిన ఫహద్ ఫాసిల్ తో బాటు ఈ మూవీ లో ఇంకో పవర్ఫుల్ పోలీస్ రోల్ ఉందని తెలుస్తుంది. దీని కోసం మొదట్లో విజయ్ సేతుపతి ని కాంటాక్ట్ చేసారని తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ‘పుష్ప ౨’  లో మరో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని, ఆ క్యారెక్టర్ లోనే అర్జున్ కపూర్ నటించబోతున్నాడని తెలుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.