‘మీటూ’అంటూ ఈ బూతు బొమ్మల సినిమా ఏంటి?

సినిమా అనేది కళాత్మకం అనేది పోయి ఫక్తు వ్యాపారంగా  మారిపోయిన తర్వాత ప్రతీది డబ్బు చేసుకునే వ్యవహారంగానే కనపడుతోంది. ప్రస్తుతం దేశాన్ని ఊపేస్తున్న‘మీటూ’ఉద్యమాన్ని సైతం క్యాష్ చేసుకోవాలనే ఆలోచన కొందరికి మొదలైంది. దాన్ని అడల్ట్ కామెడీ జానర్ లో కథగా అల్లేసి, తెరకెక్కించేసి, వేడి వేడిగా వడ్డించేయాలని ఫిక్స్ అయ్యిపోయారు. ఈ మేరకు బూతుతో నిండిన ఫస్ట్ లుక్ ని సైతం వదిలారు. ఈ ఫస్ట్ లుక్ చూసినవారికి మీటూ కు ఈ సినిమాకి సంభందం ఏమిటేనే భావన సినిమాని అమ్ముకోవాలనే ఆలోచనే ఈ దర్శక,నిర్మాతలది లాగ ఉంది.

‘మీటూ’ నేపధ్యంలో  టెమ్ట్ రవి మీటూ అంటూ ముందుకొస్తున్నాడు అంటూ పబ్లిసిటీ చేస్తున్నారు. “ఏడు చేపల కథ” చిత్రంలో టెమ్ట్ రవి అనే విభిన్నమైన పాత్రతో మెప్పించబోతున్నాడు. అడల్డ్ కామెడీ జోనర్‌లో పూర్తిగా కొత్త వారితో నిర్మిస్తున్నారు.  అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భానుశ్రీ, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా గురించి  చిత్ర నిర్మాతలు ఏమంటున్నారో చూడండి.. ‘‘ఆడవాళ్ల మీద మగవారు చేసిన అఘాయిత్యాలు.. ఆధారాలు లేకపోయినా, ఆరు సంవత్సరాల తర్వాత అయినా మనం నమ్ముతున్నాం. కానీ మగాళ్ల మీద ఆడవారు చేసే అఘాయిత్యాలను ఆధారాలతో అరిచి ఘీ పెట్టి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందుకే మగవారి తరపున మీటూ అంటూ టెమ్ట్ రవి అనే ప్రయోగాత్మక పాత్రను “ఏడు చేపల కథ” చిత్రంతో పరిచయం చేస్తున్నాం.

ఏడు చేపల కథ మూవీ హాట్ స్టిల్స్ ??

అడల్డ్ కామెడీ జోనర్‌లో రూపొందించిన ఈ చిత్రాన్ని పూర్తిగా కొత్త వారితో నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటివరకు ఈ తరహా ఫస్ట్ లుక్ పోస్టర్ రాలేదనే ప్రశంసలు దక్కుతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ని పోలిన విధంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్‌ను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మలిచాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడు చేపల కథ నడుస్తుంది. అభిషేక్ రెడ్డికి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. తన పెర్‌ఫార్మెన్స్‌తో ఇంప్రెస్ చేస్తాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సేషనల్ టీజర్‌ను విడుదల చేయబోతున్నాం..’’ అని అన్నారు.