ట్రైల‌ర్ టాక్: ఇదేం వెరైటీ వండ‌ర్ ఉమెన్ వ‌ర్సెస్ చిరుత పిల్ల వార్?

హాలీవుడ్ సినిమాలు వీక్షించే వారికి వండ‌ర్ ఉమెన్ గురించి ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నే లేదు. మ‌హిళా సామ్రాజ్య‌పు అధినేత్రిగా వండ‌ర్ ఉమెన్ విన్యాసాల‌కు బిలియ‌న్ డాల‌ర్ క‌న‌క‌వ‌ర్షం కురిసింది.

wonder woman 1984 official trailer
wonder woman 1984 official trailer

2017 లో రిలీజైన వండర్ వుమన్ సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ చిత్రం గల్ గాడోట్ అనే ఇజ్రాయెల్ నటికి సూపర్ మ్యాన్ సిరీస్ మాదిరిగానే సూపర్ ఉమెన్ లా నటించే అవ‌కాశం ద‌క్కింది. ఇజ్రాయేలీ నటికి యూనివర్సల్ స్టార్ హోదా ద‌క్కింది ఈ మూవీతోనే.

ప్ర‌స్తుతం వార్నర్ బ్రదర్స్ `వండర్ వుమన్ 1984` చిత్రాన్ని రూపొందిస్తోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. 2017 ‘వండర్ వుమన్’ చిత్రానికి సీక్వెల్ ఇది. జూన్ 5 న విడుదల కావాల్సి ఉన్నా మహమ్మారి సంక్షోభం కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 02 కి వాయిదా పడింది. అన్ని థియేటర్లు తెరిస్తే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి!

వండర్ వుమన్ 1984 చిత్రం పాటీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు. హన్స్ జిమ్మెర్ సంగీతం అందించారు. తాజా ట్రైల‌ర్ విజువ‌ల్ ఫీస్ట్ గా క‌నిపిస్తోంది. ఇక ఇందులో వండ‌ర్ ఉమెన్ తో పోరాడే లేడీ విల‌న్ చిరుత పులి వేషంతో వెరైటీగా స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంటోంది.

Wonder Woman 1984 – Official Trailer