* హెల్తీ కాంపిటీటివ్ స్పిరిట్
* రికార్డులు బ్రేక్ చేసేది ఎవరు? ఎవరి సత్తా ఎంత?
కేవలం నెలరోజుల గ్యాప్ తో `ఇండియాస్ మోస్ట్ అవైటెడ్` అని చెబుతున్న రెండు భారీ టాలీవుడ్ చిత్రాలు రిలీజ్ బరిలో దిగుతున్నాయి. ఈ రెండిటి మధ్యా అన్ని విషయాల్లో వార్ నడుస్తోందని ఫిలింనగర్ వర్గాల్లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఇరు సినిమాలకు భారీ కాస్టింగ్ ని ఎంపిక చేసుకున్నారు. అలాగే హాలీవుడ్ రేంజ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. భారీ వీఎఫ్ఎక్స్-గ్రాఫిక్స్ వర్క్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. పైగా ఈ రెండిటిలోనూ యాక్షన్ కంటెంట్ యూనిక్ గా డిజైన్ చేశారు. ఇక బడ్జెట్ల పరంగానూ ఇంచుమించు 350 కోట్ల మేర పెట్టుబడులు పెడుతుండడం ఆసక్తికరం. సాహో చిత్రానికి 350 కోట్ల బడ్జెట్ పెట్టామని ప్రభాస్ చెప్పుకొచ్చారు. దీంతో ఓ చానెల్ ఇంటర్వ్యూలో సురేందర్ రెడ్డి సైతం `సాహో`కి ఏమాత్రం తగ్గని బడ్జెట్ సైరాకి వెచ్చించామని వెల్లడించడం ఆసక్తి రేకెత్తించింది. అంటే `సైరా`కు దాదాపు 300-350 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని సన్నివేశం చెబుతోంది. ఈ రెండు సినిమాల్ని కథాంశాల పరంగా జోనర్ పరంగానూ పోల్చి చూడొద్దని ఇప్పటికే అభిమానులకు సందేశం అందింది. ఇక ఈ రెండు సినిమాల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలన్నది ముందస్తు ప్లాన్. అందుకు తగ్గట్టే విజువల్ గ్రాండియారిటీ ఉన్న కథల్ని ఎంచుకుని షూటింగులకు వెళ్లారు. అంతే వండర్ ఫుల్ గా యాక్షన్ – వార్ సన్నివేశాల్ని తెరకెక్కించారని ఇటీవల రిలీజైన విజువల్స్ తెలిపాయి. సాహో టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు వండర్ ఫుల్ అంటూ కాంప్లిమెంట్లు దక్కాయి. అంతకుమించి `సైరా` మేకింగ్ వీడియో పై ప్రశంసలు కురిశాయి. నటీనటుల ఎంపిక మొదలు ప్రతిదాంట్లో సాహో, సైరా చిత్రాల కోసం యూనివర్శల్ అప్పీల్ కోసం తపన పడ్డారని విజువల్స్ చెబుతున్నాయి.
<
p style=”text-align: justify”>ఇక ఇటీవలి కాలంలో సాహో
ప్రచారం చూస్తున్నదే. దేశంలోని నగరాలన్నిటినీ సాహో టీమ్ చుట్టేసి ప్రచారం చేస్తోంది. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో అత్యంత భారీగా సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. మునుపెన్నడూ చూడనంత గ్రాండియర్ గా దాదాపు 3కోట్ల ఖర్చుతో స్టేజీ నిర్మించి సాహో వరల్డ్ ని డిస్ ప్లే చేశారు. యువి సంస్థ ప్రమోషనల్ స్ట్రాటజీ చూశాక.. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేత రామ్ చరణ్ సైతం సైరా: నరసింహారెడ్డి
ప్రచారంలో ఏమాత్రం తగ్గ కూడదని నిర్ణయించుకున్నారట. అంటే సాహోని మించి ప్రీరిలీజ్ వేడుక మొదలు ప్రతిదీ చేయనున్నారు. సాహో తరహాలోనే ఇండియాలోని అన్ని మెట్రో నగరాల్లో సైరా చిత్రానికి ప్రచారం చేయనున్నారు. నేటి నుంచే ఈ ప్రచార యుద్ధం లో వేగం పెంచుతున్నారు. నేటి మధ్యాహ్నం 2.45 గంటలకు సైరా టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమాన సంఘాలు ఆ రేంజులోనే సైరా చిత్రాన్ని ప్రమోట్ చేయాలని నిర్ణయించాయిట. ఈ చిత్రాన్ని యూనివర్శల్ అప్పీల్ ఉన్న సినిమాగా పబ్లిసిటీ చేస్తున్నారు. సాహో
ఆర్.ఎఫ్.సి ఈవెంట్ ని మించి హైదరాబాద్ లో ప్లాన్ చేయనున్నారట. అలాగే ముంబై సహా మెట్రో నగరాల్లో ఈవెంట్లను అదిరిపోయే రేంజులో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి బడ్జెట్ .. కాస్టింగ్ లోనే కాదు.. ప్రతిదాంట్లో సాహో వర్సెస్ సైరా వార్ నడుస్తోందని అభిమానుల్లో చర్చ సాగుతోంది. అయితే రెండు భారీ చిత్రాల్ని అత్యంత క్వాలిటీతో అభిమానుల ముందుకు తెచ్చేందుకే ఈ తాపత్రయం. ఇక రిలీజ్ సహా ప్రతిదాంట్లో సాహో, సైరా బృందాలు ముందే మాట్లాడుకుని పోటీ లేకుండా రిలీజ్ చేస్తుండడం ఆసక్తికరం. ప్రస్తుతం ఈ రెండు సినిమాల భారీ తనం గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. సాహో ఆగస్టు 30న రిలీజవుతుంటే అక్టోబర్ 2న మెగాభిమానులకు ట్రీటిచ్చేందుకు సైరా సిద్ధమవుతోంది. విజువల్ ఫెస్టివల్స్ కోసం ఆ రెండు తేదీల్ని అభిమానులు లాక్ చేసుకోవాల్సిందే. ప్రపంచ సినీయవనికపై తెలుగు వాడి గౌరవాన్ని పెంచుతూ.. అంతా గర్వించేలా రెండు గొప్ప చిత్రాలు టాలీవుడ్ నుంచి వస్తున్నాయి. వీటికి ప్రేక్షకాదరణ ఆ స్థాయిలోనే ఉంటుందని ఆకాంక్షిద్దాం.