`రోబో`ని తలదన్నేలా `సైరా` గ్రాఫిక్స్!
దర్శకజీనియస్ శంకర్ తెరకెక్కించిన గ్రాఫిక్స్ మాయాజాలం `రోబో`. ప్రేక్షకుల్ని అబ్బుర పరిచిన ఈ సినిమాను మించిన గ్రాఫిక్స్‌తో చిరు సినిమా రాబోతోందని క్రేజీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చెబుతున్నారు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `సైరా నరసింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో భారీ తారాగణంతో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో చిరుకు గురువుగా అమితాబ్ బచ్చన్ నటిస్తుండటంతో ఈ సినిమాకు ప్యాన్ ఇండియా కలర్ వచ్చింది. దీంతో ప్రమోషన్స్‌ని కూడా ఆ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమాకు వీఎఫ్ ఎక్స్ అత్యంత కీలకంగా మారబోతున్నాయి. `రోబో` చిత్రాన్ని వీఎఫ్ ఎక్స్ డామినేట్ చేసిన విషయం తెలిసిందే. అంతకు మించిన స్థాయిలో `సైరా` గ్రాఫిక్స్ డామినేట్ చేస్తూనే వీక్షకుల్ని అబ్బుర పరుస్తాయని, దీని కోసం తాను 220 రోజులు శ్రమించానని రత్నవేలు చెబుతున్నారు. వేల సంక్షలో జూనియర్ ఆర్టిస్ట్‌లు, భారీ లొకేషన్స్, విదేశీ నటులతో కలిసి పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అని, ఇదొక గ్రేట్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చారు.