ఎన్టీఆర్ బయోపిక్ లో బసవ తారకం పాత్ర స్ఫూర్తినిస్తుందా ?

ఎన్టీఅర్ బయోపిక్ సినిమాకు ఊహించని బిజినెస్ క్రెజ్ వచ్చింది . మహా నటుడు , మహా  నాయకుడు నందమూరి తారక రామారావు జీవితం పై ఆయన కుమారుడు బాలకృష్ణ తండ్రి పాత్రలో నటిస్తూ నిర్మించడం. గౌతమీపుత్ర సినిమా దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి ఎంపిక చేసుకోవడం , మిగతా నటీనటుల విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణం చెయ్యడం తో ఈ సినిమాకు ట్రేడ్ లో మంచి టాక్ వచ్చింది . ఈ సినిమా పూర్తి కాకుండానే అన్ని ఏరియాలకు మంచి రేట్లు ఇస్తామని బయ్యర్లు వస్తున్నారట . అయితే బాలయ్య నిర్మాణం మీద తప్ప వ్యాపారం మీద ద్రుష్టి పెట్టడం లేదట .

ఎన్టీఆర్ బయోపిక్ ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది అనే విషయంలో రకరకాల కథలు వినిపిస్తున్నాయి . అందులో ఏది నిజమో తెలియదు . అయితే రామారావు మొదటి భార్య బసవ తారకం ను 1942లో వివాహం చేసుకున్నాడు .

వీరికి  ఎనిమిది మంది మగ  పిల్లలు, నలుగురు ఆడపిల్లలు . అయితే పెద్ద కుమారుడు రామకృష్ణ 1962లో చనిపోయాడు . అయన పేరుతోనే రామకృష్ణ స్టూడియో , థియేటర్లు నిర్మించాడు . రామారావు షూటింగ్ లో చాలా బిజిగా ఉండేవాడు . పిల్లల మంచి చెడ్డలు అన్నీ భార్య బసవ తారకమే చూసుకునేదట . తనకు, పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేక పోయినా ఎప్పుడు అసంతృప్తిగా ఉండేది కాదట . అందుకే బసవ తారకం అంటే ఆయనకు ఎంతో అభిమానం, ప్రేమ. 1982లో  తెలుగు దేశం పార్టీ పెట్టిన తరువాత రామారావు ఊపిరి తిప్పుకోలేని పనుల్లో ఉండేవాడు . తరువాత కొన్నాళ్లకే భార్యకు కాన్సర్ అని డాక్టర్లు నిర్ధారించారు . దీంతో రామారావు మానసికంగా బాగా కృంగి పోయాడట . భార్యకు ట్రీట్ మెంట్ చేయిస్తూ తరచూ  ఆసుపత్రికి వెడుతూ ఉండేవాడట . ఒక రోజు బసవ తారకమా భర్తో తో తానూ ఎక్కువ కాలం బ్రతకమని తన ప్రక్కనుండాలనే ఉద్దేశ్యంతో  మీరు మీ భాద్యత మర్చిపోతున్నారు . ఇప్పుడు తెలుగు జాతి  అభ్యున్నతి కోసం శ్రమించండి అని చెప్పిందట . ఆ మాటలు రామారావు మీద బాగా పనిచేశాయట . ఆ తరువాత బసవ తారకం 1985లో కన్నుమూశారు . రామారావు లాంటి గొప్పా నటుడు, నాయుడుకు స్ఫూర్తిని కలిగించిన అర్ధాంగి బసవ తారకం. అందుకే ఈ పాత్రకు విద్యాబాలన్ ను ఎంపిక చేశారట . మిగతా పాత్రల్లో రామారావు రెండవ భార్యగా ఆమని , చిన్నప్పటి రామారావుగా మోక్షజ్ఞ, బాలకృష్ణగా జూనియర్ ఎన్టీఆర్ ,   అక్కినేనిగా సుమంత్ ,చంద్రబాబుగా రానా , దగ్గుబాటి వెంకటేశ్వర రావుగా భరత్  రెడ్డి, భువనేశ్వరిగా  మంజిమా మోహన్ , పురందేశ్వరిగా హిమాన్సీ చౌదరి , నాదెండ్ల  భాస్కర రావుగా  సచిన్ కెదేకర్ , సావిత్రిగా నిత్యామీనన్ ,కృష్ణగా మహేష్ బాబు మొదలైన వారు నటిస్తున్నట్టు తెలుస్తుంది . దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు .