కింగ్ అక్కినేని నాగార్జున – టబు జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన `నిన్నే పెళ్లాడతా` (1996) ట్రెండ్ సెట్టర్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సందీప్ చౌతా అందించిన సంగీతం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎమోషన్స్ .. రొమాన్స్.. ఆహ్లాదకరమైన కామెడీ నేపథ్యంలో చక్కని క్లాసిక్ చిత్రంగా మలిచి కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్ గా స్థిరపడ్డారు. అయితే ఆ రేంజ్ క్లాసిక్ ని మళ్లీ తీస్తే నాగార్జున కానీ.. లేదా ఆయన వారసులు కానీ నటించాలని అక్కినేని ఫ్యాన్స్ బలంగానే కోరేవారు. కింగ్ బర్త్ డే వేళ ఈ ప్రశ్న ప్రతిసారీ అభిమానుల నుంచి స్ట్రైక్ అయ్యేది. కానీ ఆ క్లాసిక్ ని టచ్ చేయడం ఏమంత మంచిది కాదని అక్కినేని హీరోలు లైట్ తీస్కున్నారు. నాగచైతన్య.. అఖిల్ సైతం ఆ క్లాసిక్ ని టచ్ చేసే ఉద్ధేశం లేదని పలు సందర్భాల్లో తెలిపారు. అందుకే ఇప్పటివరకూ ఆ సినిమా రీమేక్ ప్రస్థావన తేలేదు.
తాజాగా ఆ టైటిల్ ని రకుల్ సోదరుడి సినిమాకి సెలెక్ట్ చేయడం అక్కినేని అభిమానుల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. అంత క్రేజీ టైటిల్ ని కింగ్ ఎలా వదులుకున్నారు? నాగచైతన్య కానీ.. అఖిల్ కానీ నటిస్తే బావుంటుంది కదా! అన్న చర్చ తిరిగి మొదలైంది. ఈ సినిమా టైటిల్ నే ప్రకటించేందుకు .. అమన్ ప్రీత్ ని హీరోగా ప్రమోట్ చేసేందుకు నాగార్జుననే తాపత్రాయ పడడం చర్చకొచ్చింది. నేడు టైటిల్ పోస్టర్ ని కింగ్ చేతులమీదుగా లాంచ్ చేశారు.
అమన్ ప్రీత్ హీరోగా ఈ ప్రేమకథా చిత్రాన్ని వైకుంఠ్ బోను దర్శకత్వంలో బి.రాజశేఖర్- వి శ్రీధర్ బాబు-కె.సాయికిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోనిక శర్మ ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. తాజా పోస్టర్ లో అమన్ -మోనిక లుక్ చూస్తే ఇంటెన్సివ్ లవ్ స్టోరిలో నటిస్తున్నారని అర్థమవుతోంది. అయితే ఈ సినిమా క్లాసిక్ మూవీ నిన్నే పెళ్లాడతా
పేరు చెడగొట్టకుండా తెలుగు ఆడియెన్ ని మెప్పిస్తుందా? అన్నది చూడాలి. రకుల్ ప్రస్తుతం నాగార్జున సరసన మన్మధుడు 2
చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.