నాకు పెళ్లవుతోంది.. ఆనందంతో డాన్స్ చేసిన అక్కినేని కోడలు!

మొత్తానికి అన్నపూర్ణ స్టూడియోలో అనుకున్న సమయానికి డిసెంబర్ 4న అక్కినేని వారసుడు నాగచైతన్య కి శోభిత ధూళిపాళ్లకి వివాహం జరిగిపోయింది. పెళ్లి దుస్తులలో ఈ జంట చూడముచ్చటగా ఉంది. ఈ పెళ్లి ఫోటోలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీళ్ళ ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పసుపు కొట్టడం, హల్దీ, మూడుముళ్ల వేడుక ఇలా ప్రతి వేడుక అభిమానులని ఆకట్టుకున్నాయి.

శోభిత కి నాగచైతన్య అంటే చాలా ఇష్టమట, అతనికి ఇది రెండో పెళ్లి అని తెలిసినా కూడా ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత తన భర్త గురించి మాట్లాడుతూ అతను ఎంతో సింపుల్ గా ఉంటారని అందరితో ఈజీగా కలిసిపోతారని పెద్దలంటే రెస్పెక్ట్ ఇస్తారని చెప్పుకొచ్చింది. పెళ్లి సమయంలో కూడా చాలా ఎమోషనల్ అయిన శోభిత అక్కినేని ఇంటి కోడలు అవుతున్నప్పటికీ పెళ్లి విషయంలో చాలా ప్లాన్ గా వ్యవహరించింది. దుస్తులు కూడా చాలా సాదాసీదాగా ధరించి ఒక సాధారణ పెళ్లికూతురు లాగే కనిపించింది.

ఆభరణాలు కూడా సాంప్రదాయ బద్ధంగా వంశపారంపర్యంగా వచ్చిన వే ధరించింది.ఆ ఫోటోలు, వీడియోలు అన్ని మనం చూసినవే అయితే శోభిత కి చెందిన మరొక వీడియో ఇప్పుడు మరింత వైరల్ అవుతుంది. ఆ వీడియోలో శోభిత తన సంతోషాన్ని దాచుకోలేక ఎంతో ఆనందంగా ఎక్సైట్మెంట్ తో డాన్స్ చేస్తుంది.

ఈ వీడియోలో తమ భారత్ సంగీత్ బీట్లకు డాన్స్ చేస్తూ కనిపించిన శోభిత ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపించింది. అల్లు అర్జున్ పాటకి ఆనందంగా డాన్సులు వేస్తూ నాకు పెళ్లి అవుతుంది నాకు సిగ్గేస్తోంది అంటూ డాన్స్ చేస్తూనే సిగ్గు పడిపోయింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని శోభిత మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా మిశ్రా షేర్ చేశారు. ప్రేమతో మెరుపు.. మ్యూజికల్ స్పర్శ @ శోభిత అని ట్యాగ్ లైన్ కూడా పెట్టారు.