‘తొక్కినేని..’ అంటూ నోరు జారినందుకు బేషరతు క్షమాపణ చెప్పి వుండాలి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. క్షమాపణ చెబితే ఆయన హుందాతనమే పెరుగుతుంది. ‘నేనెందుకు చెప్తా.?’ అంటాడాయన. బాలయ్యలాగానే, ఇంకెవరైనా ‘మందమూరి..’ అనిగానీ, ‘పందిమూరి’ అనిగానీ, ‘ముండమూరి’ అనిగానీ అని వుంటే.?
మొత్తంగా కమ్మ సామాజిక వర్గం అంతా ఒక్కటైపోయేది. అక్కినేని నాగార్జున కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా.? కానీ, కమ్మ సామాజిక వర్గంలో మళ్లీ టీడీపీ ‘మంద’ వేరు. అదే అసలు సమస్య. మీడియాని మేనేజ్ చేసేది ఈ ‘పచ్చ మంద’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
బాలయ్య వ్యాఖ్యలతో టీడీపీ అనుకూల మీడియా పూర్తిగా సైలెంటయిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా, వెబ్ మీడియా.. అంతా గప్‌చిప్. సోషల్ మీడియాలోనే అక్కినేని అభిమానులు కాస్త గింజుకున్నారు. ఇంతలోనే, బాలయ్య నుంచి ఇంకో పొగరుమోతు ప్రకటన వచ్చింది. ‘ప్రేమ నా దగ్గర వుంది.. అక్కడ లేదు..’ అని. నేరుగా నాగార్జున మీదనే బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఈసారి.
చిత్రంగా, దాన్ని టీడీపీ అనుకూల మీడియా ఇంకోసారి తొక్కేసింది. ‘మా బాబాయ్ అక్కినేని..’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలకు మాత్రమే ఎలివేషన్లు ఇచ్చాయ్. అక్కినేని అభిమానులు ఈసారి పూర్తిగా చతికిలపడిపోయారు. మీడియాలోనూ తమ రోదనకు చోటు దక్కకపోవడంతో వాళ్ళు మాత్రం ఏం చేయగలరు.? ఇంత జరుగుతున్నా అక్కినేని నాగార్జున ఎందుకు మౌనం దాల్చారన్నది ఓ మలియన్ డాలర్ క్వశ్చన్.