అత్త…అమ్మ…అక్క పాత్రల్లో బిజీ ఆర్టిస్ట్ ఎవరంటే? ప్రగతి పేరు ముందు వినిపిస్తుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్లకు అమ్మ పాత్రలో నటించి బాగా వెలుగులోకి వచ్చిన నటి. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించింది. నేచురల్ పెర్పమర్. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న నటి. సీనియర్ హీరోలు..యంగ్ హీరోల సినిమాల్లో తల్లి పాత్రకు పర్ పెక్ట్ ఛాయిస్ అని చాలా మంది దర్శకుల అభిప్రాయం కూడా. ఇండస్ర్టీలో ప్రగతికి చాలా మంది స్నేహితు కూడా ఉన్నారని ఓ సందర్భంలో తెలిపింది. అయితే అలాంటి సీనియర్ నటికి లైంగిక వేధింపులు తప్పలేదని తాజాగా ఓ ఇంటర్వూలో వెల్లడించింది.
టాలీవుడ్ లో పేరు మోసిన ఓ కమెడియన్ ప్రగతిని బాగా ఇబ్బంది పెట్టాడని సంచలన ఆరోపణలు చేసింది. ఆ కమెడియన్ పేరు చెప్పలేదు గానీ తన పట్ల మాత్రం చాలా మిస్ బిహేవ్ చేసాడని కొట్టాలన్నంత కోపం వచ్చిందని ఆగ్రహం చెందింది. ఆ కమెడియన్ పేరు చెప్పలేను కానీ, అతనికి ఎక్స్ ట్రాలు మాత్రం బాగా ఎక్కువని..మాట్లాడితే డబుల్ మీనింగ్ డైలాగులు..వెకిలి చేష్టలు చేస్తాడని…అందరూ చూస్తుండగానే జోకులు వేయడం.. ఎక్కువగా ఆడవాళ్లను ఉద్దేశించి జోకులు వేయడం….సీనియర్ అన్న అహాన్ని చూపిస్తాడని అంది. అతను ఏడాది కి 30 సినిమాల్లో నటిస్తుంటాడుట. తనతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నప్పుడే తప్పుగా ప్రవర్తించాడని అయితే తర్వాత కార్వాన్ లోకి పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటి నుంచి తన జోలికి రావడం లేదని ప్రగతి తెలిపింది.
ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో ఆ స్టార్ కమెడియన్ ఎవరు? అన్న ఆరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో ఓ ఇద్దరు కమెడియన్లు లేడీ ఆర్టిస్టులపై చుకలన భావంతో ఉంటారని ఆరోపణలున్నాయి. ఆన్ సెట్స్ లో ఆ ఇద్దరు కింద ఆర్టిస్టులను, కొత్త నటీమణులను ఉద్దేశించి కామెంట్లు చేయడం…వెటకారంగా మాట్లాడటం వంటివి చేస్తారని ఆరోపణు చాలా కాలంగా ఉన్నాయి. మీడియా ముందు కూడా జోకులేసంత చనువుతో ఆ ఇద్దరు మెలిగే వారని అంటున్నారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరే ప్రగతి పట్ల మిస్ బిహేవ్ చేసి ఉంటారని..అంతకు మించి అంత ధైర్యం ఎవరికీ ఉండదని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలాడుకుంటున్నారు.