ఫేస్‌బుక్‌లో నంబ‌ర్ వ‌న్ సౌత్‌ హీరో అత‌డే

సోష‌ల్ మీడియా యుగం ఇది. అక్క‌డ ఎంత‌గా ఫాలోవ‌ర్స్ ఉంటే అంత‌గా పాపులారిటీ ఉన్న‌ట్టు. ఫేస్ బుక్ – ఇన్ స్టా- ట్విట్ట‌ర్ మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ కోసం స్టార్లు ఎంత‌గానో త‌పిస్తున్నారు. ఇక ఇలాంటి వాటిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో స్పీడ్ గా ఉంటాడు. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ – ప్ర‌భాస్ -మ‌హేష్ వీళ్లంతా. మ‌హేష్ కి న‌మ్ర‌త ఫాలో అప్ ఉంటుంది. డిజిట‌ల్ టీమ్ ని ప్ర‌త్యేకించి హ్యాండిల్ చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచే బాధ్య‌త ఆవిడ తీసుకున్నారు. అలాగే చ‌ర‌ణ్ .. ప్ర‌భాస్ ఇటీవ‌లే డిజిట‌ల్ టీమ్ ల‌ను ఏర్పాటు చేసుకుని ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు.

తాజాగా డిజిట‌ల్లో ప్రభాస్ ఓ అరుదైన‌ ఘనత సాధించాడు.. ప్రభాస్ ఫేస్ బుక్ పేజికి కోటి 4 ల‌క్ష‌ల (14 మిలియన్లు) మంది పాలోవ‌ర్స్ కి చేర‌డం సంచ‌ల‌న‌మైంది. సౌత్ ఇండియా నంబ‌ర్ వ‌న్ హీరోగా ఫేస్ బుక్ లో రికార్డు న‌మోదు చేశాడు. ఆ త‌ర్వాతి స్థానంలో ప‌లువురు సౌత్ స్టార్లు ఉండ‌గా..

మ‌న హీరోల్లో అల్లు అర్జున్ 13.1 మిలియన్ల తో రెండో స్థానంలో నిలిచాడు. ఆ త‌ర్వాత మహేష్ 7.97 మిలియన్ల ఫాలోవ‌ర్స్ ని క‌లిగి ఉన్నాడు. రామ్ చరణ్ 7.1 మిలియన్లు.. నాని 5.2 మిలియన్లు ఫేస్ బుక్ ఫాలోవ‌ర్స్ ని క‌లిగి ఉన్నారు. బాహుబ‌లి క్రేజుతో స‌ర్రున దూసుకొచ్చిన ప్ర‌భాస్ ఇప్ప‌టికి ఫేస్ బుక్ లో నంబ‌ర్ వ‌న్ స్థానం అందుకున్నాడు.