గాన గాంధర్వుడు ఎస్ .పి బాలసుబ్రహ్మణ్యం చికిత్స వెనుక అసలేం జరుగుతోంది? వెంటి లేటర్ పై ఉన్న ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్లు చెబుతోన్న మాటలు వెనుక అసలు వాస్తవం ఏంటి? వంటి ఆసక్తికర ప్రశ్నలు ఇప్పుడు ఎస్పీబీ అభిమానుల్ని వెంటాడుతున్నాయి. కొవిడ్ -19 సోకడంతో బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఏజీఎమ్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన అయిన సంగతి తెలిసిందే. తొలుత కోవిడ్ సోకినట్లు నేరుగా ఎస్పీబీనే మీడియాకు వెల్లడించారు. దీని గురించి భయపడాల్సిన పనిలేదని ఆయనే స్వయంగా తెలిపారు. కానీ తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. ఉన్నట్లుండి ఆయన ఆరోగ్యం విషమించింది.
దీంతో ఆయన్ని ఐసీయూకి తరలించి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ఆయన ఆరోగ్యానికి సహకరిస్తున్నారని హెల్త్ బులిటెన్లు విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో బాలుకి ఆయన ఆలపించిన పాటల్నీ కూడా డాక్టర్లు వినిపిస్తున్నట్లు తెలిసింది. అలాగే బాలు కు సమీపంలో ఉన్న వార్డులో కూడా ఎస్పీ పాటలు మారుమ్రోగు తున్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు బాలు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఫోటోలు..బాగా నీరసించిన ఫోటోలు అభిమానుల్ని అందోళనకు గురిచేస్తున్నాయి. వైద్యానికి సహకరిస్తున్నప్పుడు బాలుకు పాటలు వినిపించడం వెనుక అసలు కారణం? ఏంటని కంగారు పడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కోమాలోకి వెళ్లిపోయారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సోషల్ మీడియా వేదికగా ఈ సందేహం ఇప్పుడు అభిమానుల్ని వెంటాడుతోంది. ఆయనకు మనోధైర్యం కల్పించడం కోసమే పాటలు వినిపిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. డాక్టర్లు చెబుతున్న దానికి…చోటు చేసుకుంటోన్న పరిస్థితులకు..వాస్తవానికి ఎంత మాత్రం సంబంధం లేదనే బలమైన అనుమానాలు మీడియాను అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే పలవురు సెలబ్రిటీలు, అభిమానులు బాలు త్వరగా కొలుకోవాలని దేవుళ్లను ప్రార్ధించిన సంగతి తెలిసిందే. తమ ప్రార్ధనలు తప్పకుండా ఫలిస్తాయని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని బాలు తనయుడు ఎస్. పి చరణ్ కూడా ఆశాభావం వ్యక్తం చేసారు.