మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకోసం ఇప్పటికే మార్షల్ విద్యల్లో ప్రత్యేకించి తర్ఫీదు పొందాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఫిబ్రవరి 17 నుండి వైజాగ్‌లో ప్రారంభమవుతోంది. వరుణ్ తేజ్ రీసెంట్ సక్సెస్ ట్రాక్ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు సినిమాపై పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. వరుణ్ తో ఢీ అంటే ఢీ అనే పాత్రను అతడు పోషించనున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ లార్నెల్ స్టోవాల్ ఈ చిత్రానికి ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేయనున్నారు. వరుణ్ పొడవాటి గిరజాలతో భీకర రూపంతో 6 ప్యాక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన డిజాస్టర్ మూవీ జనీ లైన్ స్ఫూర్తి అన్న ప్రచారం సాగింది.