ఆ ఇద్దరు హీరోయిన్లకి పడట్లేదా?

ఆ ఇద్దరూ ఒకే హిట్ సినిమాలో కలిసి నటించారు. పైగా హీరోయిన్లు. ఇద్దరో ఇంచుమించు అటూ ఇటూగా ఒకేసారి చిత్రసీమలో అడుగు పెట్టారు. దాంతో సహజంగానే ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. పోటీ అయితే పర్లేదు అది శృతి మించితేనే ఇబ్బంది.

ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది నిధి అగర్వాల్ – నభ నటేష్ల మధ్య. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా హిట్ అయింది. కానీ ఆ ఇద్దరిలో నభ కే ఎక్కువ ఆదరణ, అవకాశాలు వస్తుండడంతో సహజంగానే నిధికి మరోలా ఉంటుంది కదూ. అది అచ్చంగా అలానే బయటపడింది ఒక కార్యక్రమంలో. నిర్వాహకులు స్టేజి పైకి వీళ్ళిద్దరిని రమ్మంటే రాకుండా ఇబ్బందిగా మొహాలు పెట్టారు. దాంతో ఇద్దరి మధ్య ఉన్న వైరం బయట పడింది.

ఇలా ఇద్దరు హీరోయిన్లు ఉండే సినిమాల్లో త్రాసు ఎప్పుడూ ఒక హీరోయిన్ వైపు మొగ్గడం సహజమే. గతంలో కృష్ణ వంశి ‘చందమామ’ సినిమాలో కూడా క్రెడిట్ మొత్తం కాజల్ కు రావడం మనకు గుర్తు ఉండే ఉంటుంది.