HomeTollywoodనలుగురి దర్శకులు ఒక సిరీస్ !

నలుగురి దర్శకులు ఒక సిరీస్ !

కొత్త కొత్త కథలతో రూపొందే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సినిమా రంగంతో పాటు డిజిటల్ మాధ్యమానికి ఆదరణ పెరుగుతుంది. డిజిటల్ మాధ్యమాల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు కూడా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుంది. ఇప్పటి వరకు హిందీల్లోనే వెబ్ సిరీస్‌లను రూపొందిస్తున్నారు. అయితే, తాజాగా తెలుగులోనూ వెబ్ సిరీస్‌ల హవా మొదలైంది. వివరాల్లోకెళ్తే బాలీవుడ్‌ నిర్మాత రోనీ స్ర్కూవాలా నిర్మాణంలో నాలుగు కథల సంపుటిగా ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, ఒక్కొక్కరు ఓ కథను డైరెక్ట్ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.అయితే ఏమి జరుగుతుంది అని వేచి చూడాలి.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News