Malavika: తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం అదే… అవకాశం వస్తే నటిస్తా… నటి మాళవిక కామెంట్స్!

Malavika: ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ వడ్డే నవీన్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం చాలా బాగుంది. ఈ చిత్రం ద్వారా మాళవిక హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ సినిమా తరువాత మాళవిక నటించిన నాలుగు సినిమాలు వరుస ఫ్లాప్ కావడంతో ఈ హీరోయిన్ కి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ విధంగా ఈమె తెలుగులో సినిమాలు చేయలేకపోయింది. ఈ క్రమంలోనే తమిళంలో మంచి అవకాశాలు రావడంతో ఈమె ఏకంగా 35 చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే మాళవిక కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి దూరమవడమే కాకుండా తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విషయాలను ఈ కార్యక్రమం ద్వారా పంచుకున్నారు. తనకు తెలుగులో చాలా బాగుంది సినిమాతో మంచి గుర్తింపు వచ్చిందని అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకు రాకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో పెళ్లి చేసుకోవడం పిల్లలు పుట్టడంతో పూర్తిగా వారి బాధ్యతలను చూసుకుంటూ సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యానని తెలిపారు.

ఇలా అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యానని తాను ఎప్పుడు బాధ పడలేదని అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, సరైన కథ దొరికితే తప్పకుండా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తానని ఈ కార్యక్రమంలో మాళవిక తెలియజేశారు.ఇకపోతే ఈవీవీ సత్యనారాయణ చాలా బాగుంది సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని అయితే ఈ సినిమాలో రేప్ సీన్ తనకు చాలా డిస్టబెన్స్ గా అనిపించిందని ఈ కార్యక్రమం ద్వారా నటి మాళవిక తెలిపారు.