వర్షాల దెబ్బ.! టాలీవుడ్‌కి కోట్ల నష్టం.!

భారీ వర్షాలు జన జీవన్నాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయ్. జనజీవనమే కాదు, సినీ జీవితాలు కూడా అస్తవ్యస్థమయిపోతున్నాయ్ భారీ వర్షాల కారణంగా.

ముఖ్యంగా టాలీవుడ్ కొంప ముంచెస్తేస్తున్నాయ్ ఈ అనూహ్యంగా పడుతున్న భారీ వర్షాలు. పెద్ద సినిమాల కోసం కోట్ట రూపాయలతో ప్లానింగ్స్ చేస్తున్నారు.

అనుకున్న టైమ్‌కి అనుకున్న షెడ్యూల్స్ పూర్తి కాక డేట్స్ మళ్లీ అడ్జస్ట్ చేయలేక సినీ మేకర్లు ఇబ్బందులు పడుతున్నారు.

కోట్లు ఖర్చుపెట్టి, సెట్స్ వేసి, కీలక సన్నివేశాల కోసం రంగం సిద్ధం చేస్తుంటే.. అనుకోకుండా భారీ వర్షాలు షూటింగ్స్‌కి ఆటంకం కలిగిస్తున్నాయ్.

దాంతో, షెడ్యూల్స్ గల్లంతైపోతున్నాయ్. తద్వారా నష్టం ఊహలకందని రీతిలో వుంటోందని టాక్ వినిపిస్తోంది.

ప్రకృతి ప్రకోపాన్ని అదుపు చేయలేం నిజమే. అయితే, గతంలో ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగా మాత్రమే వచ్చేవి. కానీ, ఇప్పుడు అనూహ్యంగా అననుకూలంగా తరచూ తయారవుతున్నాయ్.

అందుకే ఇండోర్ షూటింగ్స్‌కే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తున్నారట. అయితే, ఈ మధ్య ఇన్‌డోర్ షూటింగ్స్‌కీ ఆటంకం కలుగుతోంది అనుకోని రీతిలో ఇండోర్ షూటింగ్స్‌కీ తిప్పలు తప్పడం లేదు వివిధ రకాల కారణాలతో.

అలా అసలే అంతంత మాత్రంగా నెట్టుకొస్తున్న టాలీవుడ్ పరిస్థితి మూలిగే నక్క మీద తాటి టెంక పడినట్లు తయారైంది.