అంజలి హీరోయిన్ గా ఐదేళ్ల కిందట ‘గీతాంజలి’ అంటూ హిట్ సినిమాను అందించారు రాజ్ కిరణ్ .ఈ సినిమా తర్వాత తనపై పెరిగిన అంచనాలు అందుకోలేకపోయి దెబ్బతిన్నారు. వరసగా… ‘త్రిపుర’, ‘లక్కున్నోడు’ లాంటి డిజాస్టర్లు వచ్చాయి రాజ్ కిరణ్ నుంచి. తర్వాత ఆయన కొంచెం గ్యాప్ తీసుకుని ‘విశ్వామిత్ర’ అనే సినిమా తీశాడు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రాజ్ కిరణ్ కో ప్రొడ్యూసర్ కూడా అయితే.
రేపు రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్న రాజ్..హార్ట్ స్ట్రోక్ కు గురై ఆసుపత్రి పాలయ్యాడు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
రాజ్ తన సినిమా విడుదలకు ముందు ఇలా గుండెపోటుకు గురి కావడం తొలిసారి కాదు. అతడి తొలి చిత్రం ‘గీతాంజలి’ రిలీజ్ ముంగిట కూడా ఇలాగే జరిగింది. కొన్ని రోజుల్లో సినిమా రాబోతుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీరిక లేకుండా ఉన్న అతను తీవ్ర ఒత్తడికి గురయ్యాడు. గుండెపోటుతో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి స్ట్రోక్ రావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కలుగుతోంది.
రెండు వరుస డిజాస్టర్ల తర్వాత రాజ్ తాను తీసిన ‘విశ్వామిత్ర’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో ఆయన పెట్టుబడి కూడా ఉండటం మరింత ఆందోళనకు గురి చేసే అంశం. దానికి తోడు ఈ చిత్రానికి ముందు నుంచి అసలు బజ్ క్రియేట్ లేదు. దాంతో అనుకున్న స్థాయిలో బిజినెస్ కూడా కాలేదు. అయినా విడుదలకు రెడీ అయ్యారు.