క్రికెట్ లెజెండ్, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ హార్ట్ ఎటాక్ కు గురయ్యారు. ఆయనకు హార్ట్ ఎటాక్ రాగానే.. వెంటనే ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఏంజియోప్లాస్టీ సర్జరీని డాక్టర్లు అత్యవసరంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన వయసు 61 సంవత్సరాలు.
అయితే.. గత కొన్ని రోజుల నుంచి కపిల్ దేవ్ ను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఆయనకు డయాబెటిస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా హార్ట్ ఎటాక్ రావడంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థనలు చేస్తున్నారు.
Wishing u speedy recovery sir @therealkapildev 🙏…
— Saina Nehwal (@NSaina) October 23, 2020
Wishing the big-hearted, mighty Kapil Dev a speedy recovery. So much more to do.
— Harsha Bhogle (@bhogleharsha) October 23, 2020