‘దర్బార్‌’: అది జరగనప్పటినుంచీ రజనీ సీరియస్,చర్యలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘దర్బార్‌’సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్ గత కొద్దీ రోజులుగా లీక్ అవుతున్నాయి. రజనీ.. సరదాగా చిత్రం టీమ్ తో కాసేపు క్రికెట్‌ ఆడారు. రజినీ , నయనతార, నివేతా థామస్ ,యోగిబాబు షూటింగ్లో భాగంగా క్రికెట్ ఆడుతున్న పిక్స్ లీక్ అయ్యాయి. తలైవా బ్యాటింగ్‌ చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ నెటిజన్లు..‘ఇది తలైవా ఐపీఎల్‌ మ్యాచ్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పడ్డాయి.

దాంతో ఇకనైనా చిత్రయూనిట్ లీకులు జరుగకుండా జాగ్రత్తపడితే మంచిదనే నిర్ణయం వచ్చింది. దాంతో ఈ సెట్ మీదకు వచ్చే విజిటర్స్ పై బ్యాన్ పెట్టినట్లు సమాచారం. అలాగే ఇప్పటికే సెట్స్ పై సెల్ ఫోన్స్ ని సైతం బ్యాన్ చేసారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలకానుంది. మొదటి సారి రజినీ- మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచానాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో రజనీ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. దాదాపు పాతికేళ్ల ఏళ్ల క్రితం వచ్చిన ‘పాండియన్‌’ చిత్రంలో రజనీ పోలీసు గెటప్‌ వేశారు. చాలా కాలం తర్వాత మళ్లీ తలైవా వెండితెరపై ఖాకీ దుస్తుల్లో కనిపించబోతుండడంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. 2020 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకల ముందుకు తీసుకురాబోతున్నారు.