కోలీవుడ్ ఇండస్ట్రీకి అక్కడి రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధం మరేచోటా కనిపించదు. తమిళనాడు అంటే పాలిటిక్స్, సినిమాలు ఎక్కువగా గుర్తొస్తాయి. ఇక అక్కడ సినీ తారలకు జన బలం ఎంత ఉన్నా కూడా కొన్నిసార్లు ప్రత్యర్థుల వలన ఇబ్బందులు తప్పవు. అయితే మరోసారి సినీ నటుడు విశాల్ తమిళ రాజకీయాల్లో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఆర్కే పురం ఉప ఎన్నికల్లో ఒక పోటీకి దిగిన విశాల్ ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. అతని బ్యాడ్ లక్ ఏమిటో గాని నామినేషన్ పత్రాలు తిరస్కరించబడ్డాయి. ఇక త్వరలో తమిళనాడులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా విశాల్ పోటీ చేసేందుకే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అతను ఏ నియోజక వర్గం నుంచి అయినా పోటీ చేయవచ్చనే కథనాలు వస్తున్నాయి.
అయితే అతనికి ఇండస్ట్రీలోనే కొందరు ప్రత్యర్ధులుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సీనియర్ నటీనటులు కొందరు విశాల్ నిర్మతల మండలీ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేశారు. ఇక ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రత్యర్ధులు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.