గత కొన్నాళ్ల నుంచి మన తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిసిందే. దీనితో వసూళ్లు పరంగా ఏ సినిమా హిట్ అందుకుంటుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు. మన తెలుగు సినిమాలు వరసగా డిజాస్టరస్ ఓపెనింగ్స్ అందుకున్నాయి.
కానీ వీటిని ఓ డబ్బింగ్ సినిమా అధిగమించి తెలుగులో మళ్ళీ థియేటర్స్ కి ఒక కొత్త ఊపుని అయితే తెచ్చింది అని చెప్పాలి. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “విక్రాంత్ రోణ” తెలుగులో కూడా అనుకున్న దానికంటే ఎక్కువ ఓపెనింగ్స్ నే నమోదు చేసినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.
ఈ సినిమాకి మొదటి మార్నింగ్ షోలు మినహాయిస్తే మొదటి రోజే మిగతా షోలకి భారీ జంప్ ని అందుకుందట. దీనితో ఫస్ట్ డే ఈ సినిమా ఏకంగా 2 కోట్లకి పైగా గ్రాస్ వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న విషయం కాదని చెప్పాలి.
మొత్తానికి అయితే కిచ్చా సినిమాతో టాలీవుడ్ లో మళ్ళీ కొత్త ఊపు అందుకుందని చెప్పాలి. అలాగే మాస్ మహారాజ్ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ కి కూడ మంచి ఓపెనింగ్స్ వస్తాయని అంటున్నారు. ఇక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ టాలీవుడ్ లో పరిస్థితి సెట్టవుతుందేమో చూడాలి.