‘మిస్టర్‌ కేకే’పై గవర్నమెంట్ బ్యాన్, కారణం ఇదే

‘మిస్టర్‌ కేకే’పై గవర్నమెంట్ బ్యాన్, కారణం ఇదే

మొన్న శుక్రవారం తమిళ స్టార్‌ విక్రమ్‌ నటించిన సినిమా ‘మిస్టర్‌ కేకే’ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తమిళంలో ఈ సినిమాను ‘కడరం కొండాన్’ టైటిల్‌తో విడుదల చేశారు. రాజేష్‌ ఎమ్‌ సెల్వ దర్శకుడు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించింది. ఇందులో అక్షరా హాసన్‌, నాజర్‌ కుమారుడు అబీ హస్సన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19న విడుదలైన సినిమా తెలుగులో ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నా తమిళంలో మంచి టాక్‌ అందుకుంది.

అయితే తమిళ సినిమాలు ఎక్కువగా ఆడే మలేషియాలో ఈ చిత్రాన్ని అక్కడ ప్రభుత్వం నిషేధించింది. ఈ సినిమాలో మలేషియా పోలీసులు, సమాజాన్ని తప్పుగా చూపించారని అక్కడి సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మలేషియాలోని విక్రమ్‌ అభిమానులు నిరాశ చెందారు.

కొందరు ఫ్యాన్స్‌ సింగపూర్‌కు వెళ్లి ‘మిస్టర్‌ కేకే’ సినిమా చూస్తున్నారట. ఈ నేపథ్యంలో మలేషియాలో ‘మిస్టర్‌ కేకే’ పంపిణీదారుల సంఘం లోటస్‌ ఫైవ్‌ స్టార్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. సినిమాను మలేషియాలో విడుదల చేయలేకపోతున్నందుకు క్షమాపణలు కోరింది.