మడోన్ అశ్విన్ డైరెక్షన్లో హీరో విక్రమ్.. వర్కింగ్ టైటిల్ చియాన్ 63!

తమిళ స్టార్ నటులలో ఒకడైన విక్రమ్ ఈ మధ్యనే తంగలాన్ సినిమాతో మన ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో పార్వతి తిరుమోతు,మాళవిక మోహన్ లో హీరోయిన్లుగా నటించగా పా రంజిత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం విక్రం ధ్రువ నచ్చతిరమ్ మరియు ధీర వీర శూరన్ పార్ట్ 2 సినిమాలలో నటిస్తున్నాడు. ఇక తదుపరి చిత్రంగా జియాన్ 63 సినిమా కోసం దర్శకుడు మడోన్ అశ్విన్ తో కలసి పనిచేయబోతున్నారు.

అశ్విన్ ఇప్పటికే మండేలా, మావీరన్ అనే సినిమాలకి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం అతను దర్శకత్వం వహిస్తున్న సిద్ధార్థ్ 40 తరువాత ఈ ప్రాజెక్టు ఉంటుందని సమాచారం. ఈ సినిమాని శాంతి టాకీస్ పై అరుణ్ విశ్వ నిర్మించనున్నారు. ఈ సినిమా నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకరైన చియాన్ విక్రమ్ సర్ తో కలిసి మా ప్రొడక్షన్ నెంబర్ త్రీ ని ప్రకటించడం నాకు ఆనందంగానూ మరియు గర్వంగాను ఉంది.

విక్రమ్ గారికి కరెక్ట్ గా సరిపోయే కథతో ఆయన్ని సరికొత్తలో చూపించబోతున్నారు అశ్విన్. విక్రం గారి ప్రయాణం చాలామందికి స్ఫూర్తినిచ్చింది. చిరస్మరణీయమైన పాత్రలలో సంచలనాత్మక చిత్రాలను అందించిన నటుడితో చేతులు కలపడం మాకు గౌరవంగా ఉంది అని చెప్పాడు. అలాగే మండేలా మరియు మావీరన్ అందించిన దర్శకుడు అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మా ప్రొడక్షన్లో ఆయనతో కలిసి పని చేయటం ఇది రెండవసారి.

అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని చెప్పారు అరుణ్ విశ్వ అయితే ప్రస్తుతం చియాన్ విక్రమ్ దర్శకుడు ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో వీర వీర శూర పార్ట్ 2 చిత్రంలో నటిస్తున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై రియా సుబ్బు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సినిమాకి స్వరాలు అందిస్తున్నారు.