మురుగదాస్  “సర్కార్ ” సినిమా కాపీ కథేనా ?

భారీ అంచనాలతో తయారైన తమిళ  “సర్కార్ ” చిత్రం కోర్ట్ వివాదంలో చిక్కుకొని ఎప్పుడు విడుదలవుతుందో తెలియని స్థితిలో వుంది . సర్కార్ సినిమాలో విజయ్ , కీర్తి సురేష్ , వరలక్ష్మి, రాధారవి నటించారు . ఎఆర్  మురుగదాస్ ఈ సినిమాకు  దర్శకత్వం వహించాడు .  సన్ పిక్చర్స్  వారు ఈ సినిమాను నిర్మించారు . ఇది తమిళ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తీసింది . అందుకే అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .

అయితే ఈ సినిమా తన కథను  కాపీ కొట్టి తీశారని సహాయ దర్శకుడు, రచయిత వరుణ్ రాజేంద్రన్ కోర్టులో కేసు వేశాడు . ఇది ఊహించని మురుగదాస్  దిగ్బ్రాంతికి గురయ్యాడు . న్యాయ పోరాటం చేద్దామనుకున్నారు . అయితే దీనివల్ల సినిమా విడుదల విషయంలో ఆలస్యమవుతుందని సన్నిహితులు చెప్పడంతో కోర్ట్  బయట  సెటిల్ చేసుకోవడాన్ని ఒప్పుకున్నాడు . ఇద్దరి మధ్య పెద్దన్నగా సౌత్ ఇండియన్ ఫిలిం రైటర్స్ అసోసియేన్ అధ్యక్షుడు కె.భాగ్య రాజా  నేతృత్వం  వహించాడు . దర్శకుడు  మురుగదాస్ , రచయిత సహాయ  దర్శకుడు  వరుణ్ రాజేంద్రన్ ను కూర్చోపెట్టి మాట్లాడాడు . వరుణ్ రాజేంద్రన్ పేరును తెర  మీద వేయడానికి మురుగదాస్  ఒప్పుకోవడంతో కథ  సుఖాంతమైంది .  మురుగదాస్  సర్కార్ సినిమాకు కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం  అనే కార్డు వేసుకోవచ్చట .

ఈ సినిమాకు ఏఆర్  రెహ్మాన్ సంగీతం సమకూర్చాడు .  దీపావళి కి సర్కార్ సినిమా విడుదల కాబోతున్నది .