యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం మొన్న ( శనివారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే పైరసి వచ్చేయటం, సినిమా యావరేజ్ అనే టాక్ నడవటంతో ఈ సినిమా రిలీజ్ రోజు కలెక్షన్స్ పై వాటి ప్రభావం ఉంటుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందలు చేస్తూ బాక్సాఫీసు వద్ద బ్రహ్మాండమైన వసూళ్లు రాబడుతోంది.తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన టాక్సీ వాలా అందరికీ లాభాలు తెస్తున్నాడు .
టాక్సీ వాలా వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఉన్నాయి .
తెలంగాణ : 3. 80 కోట్లు
సీడెడ్ : 1.05 కోట్లు
ఈస్ట్ : 48 లక్షలు
వెస్ట్ : 45 లక్షలు
కృష్ణా : 65 లక్షలు
నెల్లూరు : 26 లక్షలు
గుంటూరు : 71 లక్షలు
వైజాగ్ : 95 లక్షలు
మొత్తం : 8. 35 కోట్లు
విజయ్ దేవకొండ ఇటీవల ‘నోటా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. నోటా తో కొద్దిగా వెనకబడ్డ… విజయ్ మళ్లీ ఫాంలోకి వచ్చారని అందరూ అంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్‌మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. సినిమాను బ్లాక్‌బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పింది.
‘టాక్సీవాలా’ సినిమాకు రాహుల్ దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్. మాళవికా నాయర్, కళ్యాణి, ఉత్తేజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు.
ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.